వనపర్తి రూరల్: చిట్యాల, కడుకుంట్ల ఎంజేపీ బీసీ గురుకుల జూనియర్ కళాశాల ఇంటర్మీడియట్ బైపీసీ విద్యార్థి విలాస్ వార్షిక పరీక్షల్లో 991 మార్కులు సాధించారు. గురువారం హైదరాబాద్‌లోని సేవాలాల్ బంజారా భవన్‌లో తెలంగాణ ప్రభుత్వ బీసీ సంక్షేమశాఖ ఆధ్వర్యంలో ఎంజేపీ సొసైటీ నిర్వహించిన ప్రతిభా పురస్కారాల కార్యక్రమంలో విలాస్‌కు రాష్ట్ర ఎంజేపీ కార్యదర్శి బడుగు సైదులు ప్రతిభా పురస్కారం, రూ.10 వేలు, జ్ఞాపిక అందించి శాలువాతో సత్కరించారు. ఈ సందర్భంగా ఆర్‌సీఓ శ్రీనివాస్‌గౌడ్, డీసీఓ శ్రీవేణి, ప్రిన్స్‌పాల్ గురువయ్యగౌడ్, కళాశాల అధ్యాపక బృందం అభినందనలు తెలిపారు.


