మదనాపురం: రాష్ట్రంలోని పేదల సొంతింటి కల సాకారం చేయడమే ప్రధాన లక్ష్యంగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పని చేస్తున్నారని దేవరకద్ర ఎమ్మెల్యే జి.మధుసూదన్‌రెడ్డి అన్నారు. బుధవారం మండలంలోని నర్సింగాపురం గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల గృహ ప్రవేశాల్లో పాల్గొని లబ్ధిదారులతో కలిసి ఇళ్లను ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. నియోజకవర్గంలో అర్హులైన పేదలందరికీ ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తామన్నారు. గత ప్రభుత్వం డబుల్ బెడ్‌రూం ఇళ్ల పేరుతో పేదలను మోసం చేసిందని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు ప్రతి గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు చేపడుతున్నామని చెప్పారు. మొదటి విడత నిర్మాణాలు దాదాపు పూర్తయ్యాయని.. రెండోవిడత త్వరలోనే ప్రారంభిస్తామని తెలిపారు. అనంతరం స్థానిక నాయకులతో మాట్లాడి గ్రామంలో ఏమైనా సమస్యలుంటే తన దృష్టికి తీసుకొచ్చి పరిష్కరించుకోవాలని సూచించారు. ఎమ్మెల్యే వెంట కాంగ్రెస్‌పార్టీ సీనియర్ నాయకులు హనుమాన్‌రావు, కొండన్న, కాంగ్రెస్ కార్యకర్తలు, నాయకులు ఉన్నారు.
దేవరకద్ర ఎమ్మెల్యే జి.మధుసూదన్‌రెడ్డి


