వనపర్తి: బక్రీద్‌కు కట్టుదిట్టమైన భద్రత కల్పిస్తున్నామని అదనపు ఎస్పీ రాజేష్ మీనా తెలిపారు. బుధవారం డీజీపీ సీపీ ఆనంద్ హైదరాబాద్ నుంచి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఇతర పోలీసు అధికారులతో కలిసి ఆయన పాల్గొన్నారు. బక్రీద్ సందర్భంగా జిల్లాలో భద్రతా చర్యలు, ప్రత్యేక బందోబస్తు ప్రణాళికలు, చెక్‌పోస్టుల పర్యవేక్షణ, పోలీస్ బృందాల మొహరింపు తదితర అంశాల గురించి డీజీపీకి వివరించారు. వీడియో కాన్ఫరెన్స్‌లో డీఎస్పీ గిరిబాబు, డీసీఆర్బీ డీఎస్పీ బాలాజీనాయక్, జిల్లా పశుసంవర్ధకశాఖ అధికారి వెంకటయ్యగౌడ్, వనపర్తి, కొత్తకోట సీఐలు సుగంధ రత్నం, శ్రీరాంబాబు, మున్సిపల్ శానిటరీ ఇన్‌స్పెక్టర్ ఉమామహేశ్వర్‌రెడ్డి, స్పెషల్ బ్రాంచ్ ఎస్‌ఐ రామేశ్వర్‌రెడ్డి, ఇతర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
అదనపు ఎస్పీ రాజేష్ మీనా


