త్వరలోనే పట్టణ, మండల కార్యవర్గాల ఎంపిక | - | Sakshi
Sakshi News home page

త్వరలోనే పట్టణ, మండల కార్యవర్గాల ఎంపిక

Apr 5 2026 7:30 AM | Updated on Apr 5 2026 7:30 AM

వనపర్తిటౌన్‌: కాంగ్రెస్‌పార్టీ మండల, పట్టణ కార్యవర్గాలను త్వరలోనే ప్రకటిస్తామని డీసీసీ అధ్యక్షుడు, శాట్‌ చైర్మన్‌ శివసేనారెడ్డి అన్నారు. శనివారం జిల్లాకేంద్రంలోని డీసీసీ కార్యాలయంలో జరిగిన జిల్లా కార్యవర్గ సమావేశంలో ఆయన మాట్లాడారు. అప్పగించిన బాధ్యతను సమర్థవంతంగా నిర్వర్తించాలని, ప్రజలు, పార్టీ కోసం పని చేయాలని సూచించారు. గతంలో ఉన్న కార్యవర్గం, ప్రస్తుత కార్యవర్గం పనితీరులో మార్పు కనిపించాలని, నిబద్ధత, ఐక్యతతో పనిచేసి పార్టీ బలోపేతానికి కృషి చేయాలన్నారు. జిల్లాలోని మండలాలకు ఇన్‌చార్జ్‌లను నియమించినట్లు తెలిపారు. పార్టీ కోసం పనిచేసే ప్రతి కార్యకర్తకు అవకాశం దక్కుతుందని, పార్టీ ఏ బాధ్యత అప్పగించలేదని నిరాశ చెందొద్దని కోరారు. కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షుడు పి.తిరుపతయ్య, సాయిచరణ్‌రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి బ్రహ్మచారి, ధనలక్ష్మి, జిల్లా కార్యవర్గ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

‘కష్టపడిన వారికే

పదవులు’

ఆత్మకూర్‌: కాంగ్రెస్‌పార్టీలో కష్టపడిన ప్రతి కార్యకర్తకు న్యాయం జరుగుతుందని.. పదవులు లభిస్తాయని పార్టీ జిల్లా ఇన్‌చార్జ్‌లు కోళ్ల వెంకటేష్‌, రమేష్‌గౌడ్‌ అన్నారు. శనివారం పట్టణంలోని ఓ ఫంక్షన్‌ హాల్‌లో పార్టీ మండల అధ్యక్షుడు పరమేష్‌ అధ్యక్షతన మండల విస్తృతస్థాయి కార్యకర్తల సమావేశానికి వారు హాజరై మాట్లాడారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్‌ ప్రభుత్వంలో అర్హులందరికి సంక్షేమ ఫలాలు అందుతున్నాయన్నారు. ఈ సందర్భంగా మండల, పట్టణ కార్యవర్గాల ఏర్పాటులో భాగంగా ఆశావహుల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. అనంతరం సీఎం రిలీఫ్‌ఫండ్‌ చెక్కులను లబ్ధిదారులకు అందజేశారు. కార్యక్రమంలో మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ రహ్మతుల్లా, పుర చైర్‌పర్సన్‌ నాగమణి, వైస్‌ చైర్మన్‌ నల్లగొండ శ్రీనివాస్‌, డీసీసీ కార్యదర్శి తులసీరాజ్‌ యాదవ్‌ వివిధ గ్రామాల సర్పంచులు, కౌన్సిలర్లు, నాయకులు పాల్గొన్నారు.

క్రీడా ప్రతిభను వెలికి

తీయడమే ప్రధాన లక్ష్యం

జెడ్పీసెంటర్‌(మహబూబ్‌నగర్‌): మహబూబ్‌నగర్‌ లోక్‌సభ నియోజకవర్గ పరిధిలో ఏప్రిల్‌ 9 నుంచి 24 వరకు నిర్వహించనున్న ‘ప్రధాన్‌మంత్రి సంసద్‌ ఖేల్‌ మహోత్సవ్‌’ ద్వారా గ్రామీణ యువతలో దాగి ఉన్న క్రీడా ప్రతిభను వెలికితీసి, వారికి రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణించే అవకాశాలు కల్పించడమే ప్రధాన లక్ష్యమని ఎంపీ డీకే అరుణ పేర్కొన్నారు. ఈ క్రీడా మహోత్సవానికి సంబంధించి శనివారం కలెక్టర్‌ సమావేశ మందిరంలో నిర్వహించిన సన్నాహక సమావేశంలో మాట్లాడుతూ మండల, అసెంబ్లీ స్థాయి ఇన్‌చార్జులు, జిల్లా విద్యాశాఖ అధికారులు, యువజన క్రీడాశాఖ అధికారులు, పీఈటీలు, ఫిజికల్‌ డైరెక్టర్లు తదితరులు సమన్వయంతో పనిచేసి ఈ క్రీడ మహోత్సవాన్ని విజయవంతం చేయాలని సూచించారు. ఈ కార్యక్రమానికి ప్రారంభోత్సవం ఏప్రిల్‌ 9న నారాయణపేటలో నిర్వహించనున్నట్లు తెలిపారు. గ్రామస్థాయి జట్లు ఏప్రిల్‌ 6లోగా ఆఫ్‌లైన్‌ ద్వారా నమోదు చేసుకోవాలని సూచించారు. ఏప్రిల్‌ 9 నుంచి 15 వరకు మండల స్థాయి పోటీలు, ఏప్రిల్‌ 15 నుంచి 20 వరకు అసెంబ్లీ స్థాయి పోటీలు, ఏప్రిల్‌ 21 మరియు 22 తేదీల్లో పార్లమెంటరీ స్థాయి పోటీలు నిర్వహించనున్నట్లు చెప్పారు. ఏప్రిల్‌ 23న రన్నింగ్‌రేస్‌ నిర్వహిస్తామని, ఏప్రిల్‌ 24న బహుమతుల ప్రదానోత్సవం, ముగింపు కార్యక్రమం ఉంటుందని తెలిపారు. ముగింపు కార్యక్రమానికి గవర్నర్‌ శివప్రతాప్‌ శుక్లా ముఖ్య అతిథిగా హాజరుకానున్నట్లు పేర్కొన్నారు. ఈ క్రీడా మహోత్సవంలో కబడ్డీ, ఖోఖో, వాలీబాల్‌, క్రికెట్‌ పోటీలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ప్రతి మండలంలో ప్రతి క్రీడకు ఒక కో–ఆర్డినేటర్‌ చొప్పున నలుగురిని నియమించి పోటీల నిర్వహణను సమర్థవంతంగా చేపట్టాలని సూచించారు. యువత శారీరక, మానసిక అభివద్ధికి క్రీడలు ఎంతో ఉపయోగపడతాయని, డ్రగ్స్‌ వంటి చెడు అలవాట్ల నుంచి దూరంగా ఉంచడంలో కీలకపాత్ర పోషిస్తాయని పేర్కొన్నారు. ఈ క్రీడలలో పురుషులతో పాటు సీ్త్రలు, బాలికలకు కూడా ప్రాముఖ్యత ఇచ్చి వారిని పాల్గొనే విధంగా ప్రోత్సహించాలని ఎంపీ సూచించారు. సమావేశంలో డీఈ ఓ ప్రవీణ్‌ కుమార్‌, డీవైఎస్‌ఓలు శ్రీనివాస్‌, వెంకటేష్‌, సుధీర్‌రెడ్డి, జిల్లా కోఆర్డినేటర్‌ తిరుపతిరెడ్డి, డిప్యూటీ సీఈఓ మల్లికార్జున్‌ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement