వెబ్‌కాస్టింగ్‌ను పర్యవేక్షించిన కలెక్టర్
మహబూబ్‌నగర్ రూరల్‌లో బీఆర్‌ఎస్ గెలుపు సంబురం
వనపర్తి: జిల్లాలోని 5 మండలాల్లో గురువారం జరిగిన తొలివిడత గ్రామపంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఆదర్శ్ సురభి అన్నారు. ఉదయం 7 నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు జరిగిన పోలింగ్ సరళిని ఆయన కలెక్టరేట్‌లోని సమావేశ మందిరం నుంచి ఆయనతో పాటు ఎస్పీ సునీతరెడ్డి, సాధారణ ఎన్నికల పరిశీలకుడు మల్లయ్యబట్టు, వ్యయ పరిశీలకుడు శ్రీనివాస్ వెబ్‌కాస్టింగ్ ద్వారా పర్యవేక్షించారు. అన్ని పోలింగ్ కేంద్రాల్లో సకాలంలో ఎన్నికలు పూర్తికాగా.. ఖిల్లాఘనపురం గ్రామపంచాయతీలో మధ్యాహ్నం ఒంటిగంట వరకు పోలింగ్ కేంద్రంలో ఉన్న ఓటర్లందరినీ ఓటు వేయించినట్లు చెప్పారు. నిర్దేశిత సమయానికి పోలింగ్ కేంద్రాల గేట్లు మూసి క్యూలైన్లలో ఉన్న వారందరికీ ఓటు వేసే అవకాశం కల్పించినట్లు కలెక్టర్ తెలిపారు. జిల్లాలో ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా ప్రశాంతంగా పోలింగ్ ముగిసిందని, పోలీస్‌శాఖ కట్టుదిట్టమైన శాంతిభద్రత చర్యలు చేపట్టినట్లు వివరించారు. తొలివిడతలో ఎన్నికలు జరిగిన ఖిల్లాఘనపురం, పెద్దమందడి, గోపాల్‌పేట, రేవల్లి, ఏదుల మండలాల్లో మొత్తం 1,03,225 ఓట్లు, 84.9 శాతం ఓటింగ్ నమోదైందన్నారు. వెబ్‌కాస్టింగ్‌లో అదనపు కలెక్టర్లు యాదయ్య, ఖీమ్యానాయక్, ఇతర అధికారులు పాల్గొన్నారు.
వెబ్‌కాస్టింగ్‌ను పర్యవేక్షించిన కలెక్టర్


