తొలి జీఓ ప్రకారమే నిర్మించాలి..
కొత్తపల్లి–జూరాల మధ్య బ్రిడ్జి నిర్మిస్తే మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న నందిమల్లకు వెళ్లాలంటే మేము 30 కి.మీలు చుట్టి రావాలి. శ్రీశైలం ప్రాజెక్ట్ మాదిరిగాా గేట్లు వేసి రాకపోకలు నిలిపివేస్తే.. మా వ్యాపారాలు జరగవు. రేవులపల్లి–నందిమల్ల మధ్య బ్రిడ్జి నిర్మిస్తే మా పొలాలకు కాస్త రేట్లు వస్తాయి. చిన్నాచితక వ్యాపారాలతో జీవనోపాధి పొందొచ్చనేది మా ఆశ. తొలి జీఓ ప్రకారమే బ్రిడ్జి నిర్మించాలి. అంతవరకూ పోరాటం తప్పదు. – రాజు, రేవులపల్లి,
ధరూర్ (జోగుళాంబ గద్వాల)
ఎవరూ అడ్డుకోవద్దు..
ఆత్మకూరు మండలంలోని జూరాల పుష్కర ఘాట్ వద్ద కృష్ణా నదిపై బ్రిడ్జి నిర్మిస్తేనే ప్రయోజనకరం. ఆత్మకూరు నుంచి గద్వాలకి వెళ్లాలంటే ప్రస్తుతం 33 కి.మీలు ప్రయాణం చేయాలి. ఈ బ్రిడ్జి నిర్మిస్తే కేవలం 12 కి.మీ.లకే గద్వాల వెళ్లొచ్చు. 1979లోనే ఈ ప్రాంతంలో బ్రిడ్జి నిర్మించాల్సి ఉంది. మంత్రి వాకిటి శ్రీహరి కృషితో కొత్తపల్లి – జారాల మధ్య నిర్మాణం కానుంది. ఎవరూ అడ్డుకోవద్దని.. అటుఇటు అయితే మేమూ పోరాటానికి సిద్ధం.
– రహమతుల్లా, మార్కెట్ కమిటీ చైర్మన్, ఆత్మకూర్ (వనపర్తి)
●
తొలి జీఓ ప్రకారమే నిర్మించాలి..


