జిల్లాకు ఏడుగురు ఎంపీడీఓలు
వనపర్తి: ఇటీవల వెలువడిన గ్రూప్–1 ఫలితాల్లో ఉద్యోగాలు సాధించి ఎంపీడీఓలుగా ఎంపికై న ఏడుగురిని జిల్లాకు కేటాయించారు. సోమవారం స్థానిక సంస్థల ఇన్‌చార్జ్ అదనపు కలెక్టర్, జెడ్పీ సీఈఓ యాదయ్య వారికి మండలాలు కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. చిన్నంబావి మండలానికి ఎస్.ఆదర్శ్‌గౌడ్, ఖిల్లాఘనపురం మండలానికి విజయసింహారెడ్డి, గోపాల్‌పేటకు అయేషా అన్‌జూం, పెబ్బేరుకు బిట్టు వెంకటేష్, పెద్దమందడికి టి.పరిణతి, రేవల్లి మండలానికి అల్లి కీర్తనను నియమించారు.
మాదక ద్రవ్యాల
నిర్మూలనపై ప్రతిజ్ఞ
వనపర్తి: నషాముక్త్ భారత్ అభియాన్‌లో భాగంగా సోమవారం మహిళా, శిశు, వికలాంగులు, వయోవృద్ధులశాఖ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు ఆ శాఖ జిల్లా అధికారి సుధారాణి తెలిపారు. కార్యక్రమ నిర్వహణకు సంబంధించిన వాల్‌పోస్టర్లను ఆమె ఆవిష్కరించి అధికారులతో ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. మాదక ద్రవ్యాల నియంత్రణపై నిర్వహించే ఈ కార్యక్రమం వారం పాటు కొనసాగుతుందని చెప్పారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు ఎన్.ఖీమ్యానాయక్, యాదయ్య, ఇతర అధికారులు తదితరులు పాల్గొన్నారు.
30న విద్యాసంస్థల బంద్
వనపర్తిటౌన్: ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్ బకాయిలను ప్రభుత్వం తక్షణం విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 30న విద్యాసంస్థల బంద్‌కు పిలుపునిచ్చినట్లు ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి ఎం.ఆది తెలిపారు. సోమవారం జిల్లాకేంద్రంలోని సిద్ధార్థ డిగ్రీ కళాశాలలో విద్యాసంస్థల బంద్ వాల్‌పోస్టర్లను విడుదల చేసి మాట్లాడారు. ఇంజినీరింగ్, పీజీ, డిగ్రీ కళాశాలలు, యూనివర్సిటీలకు మాత్రమే రాష్ట్రవ్యాప్త బంద్ వర్తిస్తుందని తెలిపారు. ఏళ్ల తరబడి బకాయిలు చెల్లించకపోవడం.. విద్యార్థుల బోధనపై ప్రభావం పడుతుందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి విద్యాసంస్ధలను బలోపేతం చేసే ఆశయం ఉంటే వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. బంద్‌కు జిల్లాలోని అన్ని కళాశాలల యాజమాన్యాలు సహకరించాలని కోరారు. కార్యక్రమంలో ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కమిటీ సభ్యులు వీరన్ననాయక్, ఈశ్వర్, శివ, మహేష్, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
జిల్లాకు ఏడుగురు ఎంపీడీఓలు


