
దసరాకు ప్రత్యేక బస్సులు
రీజియన్ వ్యాప్తంగా 641 అదనపు సర్వీసులు
రీజియన్
వ్యాప్తంగా..
●
స్టేషన్ మహబూబ్‌నగర్: ఈ ఏడాది దసరా పండుగను పురస్కరించుకొని మహబూబ్‌నగర్ రీజియన్‌లో 641 ఆర్టీసీ అదనపు బస్సు సర్వీసులు తిరగనున్నాయి. రీజియన్‌లోని పది డిపోల నుంచి ఈ అదనపు బస్సులు శనివారం ప్రారంభం కాగా.. వచ్చే నెల 2వ తేదీ వరకు నడపనున్నారు. దసరా పండుగ రద్దీని దృష్టిలో ఉంచుకొని మహబూబ్‌నగర్ రీజియన్‌లోని డిపోల నుంచి అదనపు సర్వీసులు నడపనున్నారు.
దసరా పండుగ సందర్భంగా సాధారణ రోజుల కంటే మహబూబ్‌నగర్ ఆర్టీసీ రీజియన్‌కు కొద్దిమేర ఆదాయం పెరిగే అవకాశం ఉంది. పండుగ ప్రారంభ మూడు రోజులు, ముగింపు అనంతరం రెండు రోజుల్లో బస్సుల్లో ప్రయాణించేవారి సంఖ్య ఎక్కువగా ఉండటం వల్ల ఆర్టీసీకి ఆదాయం పెరుగుతుందని భావిస్తున్నారు.
దసరా పండుగను పురస్కరించుకొని మహబూబ్‌నగర్ రీజియన్ వ్యాప్తంగా 641 అదనపు సర్వీసులు నడవనున్నాయి. హైదరాబాద్ రూట్లో ఎక్కువ అదనపు బస్సు సర్వీసులు నడపనున్నారు. ఈ రూట్లోనే ఆర్టీసీకి అధిక ఆదాయం వచ్చే అవకాశం ఉంది. అదేవిధంగా కర్నూలు రూట్‌లోనూ అదనపు బస్సులు నడవనున్నాయి. మహబూబ్‌నగర్ డిపో నుంచి అధికంగా 93 అదనపు బస్సులు నడపనున్నారు. హైదరాబాద్‌లోని వివిధ ప్రాంతాల్లో ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలోని వివిధ బస్టాండ్లలో ప్రయాణికుల రద్దీ దృష్ట్యా, వారి సౌకర్యార్థం అదనపు వలంటీర్లను అందుబాటులో ఉంచుతున్నారు. అదేవిధంగా తాగునీటి వసతి, షెల్టర్లు, కూర్చోవడానికి కుర్చీలు, బస్సుల వివరాలు, సూచనలను ఎప్పటికప్పుడూ ప్రయాణికులకు అందించే విధంగా ఏర్పాట్లు చేస్తున్నారు. కాగా.. ఆదివారం నుంచి పాఠశాలలకు సెలవులు ఉండడంతో శనివారం బస్టాండ్లలో రద్దీ కొంతమేర కనిపిస్తోంది. మరో రెండు రోజుల్లో మరింత రద్దీ పెరిగే అవకాశం ఉంది.
వచ్చేనెల 2 వరకు నడపనున్న ఆర్టీసీ
హైదరాబాద్ మార్గంలోనే
రాకపోకలు అధికం

దసరాకు ప్రత్యేక బస్సులు

దసరాకు ప్రత్యేక బస్సులు