
నేటి నుంచి అంతర్‌జిల్లా సెపక్‌తక్రా పోటీలు
వనపర్తి: జిల్లాకేంద్రంలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల మైదానంలో ఆది, సోమవారం 11వ సెపక్‌తక్రా ఇంటర్ డిస్ట్రిక్ట్ చాంపియన్‌షిప్ పోటీలు నిర్వహిస్తున్నట్లు అసోసియేషన్ అధ్యక్షుడు బండారు శ్రీనివాస్‌గౌడ్ తెలిపారు. పోటీల నిర్వహణకు అవసరమైన ఏర్పాట్లను శనివారం ఆయన పరిశీలించి మాట్లాడారు. పోటీల్లో రాష్ట్రంలోని ఉమ్మడి పది జిల్లాల పరిధిలో మొత్తం 20 జట్లు పాల్గొంటాయని.. అందులో 10 మహిళలు, 10 పురుష జట్లు ఉంటాయని తెలిపారు. క్రీడా పోటీలను రాష్ట్ర పశుసంవర్ధక, క్రీడలశాఖ మంత్రి వాకిటి శ్రీహరి, వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి, రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి, రాష్ట్ర స్సోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేనారెడ్డి ప్రారంభిస్తారని వివరించారు. ఎంపికై న క్రీడాకారులు వచ్చే నెల గోవాలో జరిగే జాతీయస్థాయి పోటీల్లో పాల్గొంటారని వివరించారు. ఈ పోటీల్లో ఖిల్లాగణపురం మండలానికి చెందిన జాతీయ క్రీడాకారిణి వనిత పాల్గొంటుందని.. మరోసారి జాతీయస్థాయి పోటీలకు సిద్ధమవుతున్నారని తెలిపారు. పోటీలను తిలకించేందుకు జిల్లాలోని క్రీడాకారులతో పాటు క్రీడాభిమానులు భారీగా తరలిరావాలని పిలుపునిచ్చారు. ఏర్పాట్లను పరిశీలించిన వారిలో అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్‌గౌడ్‌తో పాటు భాస్కర్‌గౌడ్, భాస్కర్‌రెడ్డి, గట్టు వెంకన్న, ఉప్పల భాస్కర్, జగదీశ్‌రెడ్డి తదితరులు ఉన్నారు.