
ప్రజాపాలన దినోత్సవానికి కలెక్టరేట్ ముస్తాబు
వనపర్తి: ప్రజాపాలన దినోత్సవ నిర్వహణకు కలెక్టరేట్ ఆవరణలో ఏర్పాట్లు చేపట్టారు. అధికారులు, ప్రజాప్రతినిధులు, ప్రజల భాగస్వామ్యంతో బుధవారం జరిగే కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా తెలంగాణ శాసనమండలి చీప్ విప్ పట్నం మహేందర్‌రెడ్డి హాజరుకానున్నారు. ఉదయం పది గంటలకు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి జిల్లా ప్రగతి నివేదికను చదివి వినిపిస్తారు. అనంతరం పోలీసు గౌరవ వందనం స్వీకరిస్తారు. ఈ సందర్భంగా తెలంగాణ, జాతీయ గీతాలను ఆలపిస్తారు. వేడుకలకు కలెక్టర్ ఆదర్శ్ సురభి, ఎస్పీ రావుల గిరిధర్, ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి తదితరులు హాజరుకానున్నారు.