
రాష్ట్రస్థాయి కిక్‌బాక్సింగ్‌కు జిల్లా క్రీడాకారులు
వనపర్తిటౌన్: హైదరాబాద్ లాల్ బహద్దూర్ ఇండోర్ స్టేడియంలో అస్మిత రాష్ట్రస్థాయి కిక్ బాక్సింగ్ లీగ్ 2025–26 పోటీలు రాష్ట్ర కిక్ బాక్సింగ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శని, ఆదివారం జరగనున్నట్లు డీవైఎస్‌ఓ సుధీర్‌కుమార్‌రెడ్డి తెలిపారు. జిల్లా తరుఫున ఎంపికై న క్రీడాకారులను శుక్రవారం ఆయన అభినందించి మాట్లాడారు. పట్టణానికి చెందిన గుజూరియో కరాటే అండ్ కిక్ బాక్సింగ్ అకాడమి విద్యార్థినులు ఝాన్సీ, డి.అనన్య, ఆరాధ్య 38, డి.లౌక్య, హరిణి, ప్రియ, గోమతి పోటీ పడనున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ సెక్రెటరీ సురేందర్‌రెడ్డి, రాష్ట్ర కిక్‌బాక్సింగ్ అసోసియేషన్ సంయుక్త కార్యదర్శి కరాటే శేఖర్, గుజూరియో కరాటే కిక్ బాక్సింగ్ అకాడమీ సీనియర్ విద్యార్థులు ఎం.శివకృష్ణ యాదవ్, ఎస్.వరుణ్‌కుమార్, చంద్రకాంత్, చక్రవర్తి, ఎం.రేణుక తదితరులు పాల్గొన్నారు.