
కార్మిక వ్యతిరేక లేబర్‌కోడ్లు రద్దు చేయాలి
వనపర్తి రూరల్: కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కా ర్మిక వ్యతిరేక నాలుగు లేబర్‌కోడ్లను వెంటనే రద్దు చేయాలని సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షుడు చుక్కా రాములు డిమాండ్ చేశారు. సోమవారం సీఐటీయూ 4వ మహాసభలు పెబ్బేరులో నిర్వహించగా ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా పట్టణంలోని అంబేడ్కర్ చౌరస్తా నుంచి సుభాష్‌చౌరస్తా, బస్టాండ్ మీదుగా సహారా ఫంక్షన్ హాల్ వరకు కార్మికులు భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం సంఘం జిల్లా అధ్యక్షుడు మండ్ల రాజు అధ్యక్షతన జరిగిన బహిరంగ సభలో ఆయనతో పాటు సంఘం రాష్ట్ర ప్రధానకార్యదర్శి పాలడగు భాస్కర్‌తో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అన్నిరకాల కాంట్రాక్టు కార్మికులకు సమాన పనికి సమాన వేతనం అమలు చేయాలని, ఈపీఎఫ్ పింఛన్ కనీసం రూ.9 వేలు చెల్లించాలని, అన్నివర్గాల కార్మికులకు సామాజిక భద్రత కల్పించాలన్నారు. ఎన్‌పీఎస్, యూపీఎస్‌ను రద్దుచేసి పాత చట్టబద్దమైన పింఛన్ పునరుద్ధరించాలని కోరారు. కార్యక్రమంలో సంఘం రాష్ట్ర ఉపాఽధ్యక్షులు జయలక్ష్మి, జిల్లా ప్రధాన కార్యదర్శి పుట్టా ఆంజనేయులు, నాయకులు ఆర్‌ఎన్ రమేష్, రాము, ఎండీ మహముద్, సునీత, గంధం మదన్, బొబ్బిలి నిక్సన్, బుచ్చమ్మ, ఊశన్న, దేవన్న , ఆహ్వాన సంఘం అధ్యక్షులు బాలయ్య, శారద పాల్గొన్నారు.