
వినియోగదారుల ఫోరంలో ఫిర్యాదు చేయండి
వనపర్తి రూరల్: రైతులు ఎరువులు, విత్తనాలు కొనుగోలు చేసినప్పుడు దుకాణదారుడితో విధిగా రసీదు తీసుకొని పంట దిగుబడి సరిగా రానప్పుడు వినియోగదారుల ఫోరంలో ఫిర్యాదు చేయాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి రజని సూచించారు. బుధవారం మండలంలోని ఖాసీంనగర్‌లో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన అవగాహన సదస్సుకు ఆమె ముఖ్యఅతిథిగా హాజరై ప్రజలకు చట్టాలపై అవగాహన కల్పించారు. బాల్యవివాహాలు, బాల కార్మికుల చట్టం గురించి వివరించారు. అదేవిధంగా ఉచిత న్యాయ సాయం కోసం టోల్‌ఫ్రీ నంబర్ 15100ను సంప్రదించాలని తెలిపారు. అనంతరం గ్రామంలో ఉచిత న్యాయ సేవా కేందాన్ని ప్రారంభించారు. న్యాయపరమైన సహాయం, సలహాల కోసం కమిటీలో ఉన్న ప్యానల్ లాయర్లు తిరుపతయ్య, ఎండీ నిరంజన్‌బాబా, పారా లీగల్ వలంటీర్లు శివప్రసాద్, రవీందర్‌ను సంప్రదించాలని సూచించారు. కార్యక్రమంలో డా. పుష్పలత, ప్యానల్ లాయర్లు తిరుపతయ్య, కృష్ణయ్య, ఎండీ నిరంజన్‌బాబా, వలంటీర్లు రవీందర్, శివప్రసాద్, నాగరాజు, కార్యదర్శి లక్ష్మి, మాజీ సర్పంచ్ రాములు తదితరులు పాల్గొన్నారు.