
‘వైఎస్సార్ పథకాలు మరువలేనివి’
వనపర్తిటౌన్: అనేక సంక్షేమ పథకాలు అమలుచేసి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రజల గుండెల్లో నేటికీ చెదరని ముద్ర వేసుకున్న నాయకుడు వైఎస్ రాజశేఖరరెడ్డి అని డీసీసీ అధ్యక్షుడు రాజేంద్రప్రసాద్ కొనియాడారు. నాటి ఆయన పాలనలో అమలు చేసిన పథకాలు నేటికీ ప్రజలకు లబ్ధి చేకూరుస్తున్నాయని గుర్తుచేశారు. రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు డా. చిన్నారెడ్డి ఆదేశానుసారం మంగళవారం జిల్లాకేంద్రంలోని డీసీసీ కార్యాలయంలో పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి చీర్ల జనార్దన్‌సాగర్ ఆధ్వర్యంలో వైఎస్ రాజశేఖరరెడ్డి జయంతి ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు వైఎస్సార్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ప్రజలు ఆయనను, ఆయన పాలనను ఎన్నటికీ మరువరని పేర్కొన్నారు. మైనార్టీ రాష్ట్ర నాయకులు అఖ్తర్, కమర్‌మియా, పట్టణ మాజీ అధ్యక్షుడు కిరణ్‌కుమార్, వర్కింగ్ ప్రెసిడెంట్ కదిరె రాములు, జిల్లా మైనార్టీ అధ్యక్షుడు సమద్‌మియా, రాగి వేణు, ఎండీ బాబా, నారాయణ, కోళ్ల వెంకటేష్, పాండురావు, సురేష్‌గౌడ్, వేణయ్యచారి, మెంటేపల్లి రాములు, రోహిత్, లీలావతి, చిట్టెమ్మ, జయమ్మ, యాదమ్మ, అలిసమ్మ, నారాయణమ్మ పాల్గొన్నారు.