
పురం.. అధ్వానం
వనపర్తి టౌన్: జిల్లాకేంద్రంలో పారిశుద్ధ్య నిర్వహణ లోపం పట్టణవాసులకు శాపంగా మారుతోంది. కొత్తగా ఏర్పడిన కాలనీల్లో ఒకట్రెండు ప్రాంతాలు మినహా మిగతా కాలనీల్లో సరైన డ్రెయినేజీ వ్యవస్థ లేక ఇళ్ల నుంచి వెలువడే మురుగంతా రహదారులపై పారుతుండటంతో ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు. రోజుల తరబడి పారిశుద్ధ్య కార్మికులు రాకపోవడంతో ఇళ్ల ముంగిట మురుగు నిలిచి దోమలు విజృంభిస్తున్నాయి. దీంతో డెంగీ, మలేరియా వంటి విష జ్వరాల బారిన పడుతున్నామని ఆయా ప్రాంత వాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తప్పని పరిస్థితుల్లో కొన్నిచోట్ల కాలనీవాసులే మురుగు తొలగించుకోవాల్సిన దుస్థితి నెలకొంది.
ఫొటోలకే పరిమితం..
పట్టణాలను పరిశుభ్రంగా మార్చేందుకు ప్రభుత్వం వంద రోజుల ప్రణాళిక రూపొందించినా.. అధికారులు నిర్వహణను గాలికొదిలేశారు. ఫొటోల కోసం ఓ చిన్న ప్రాంతంలో హడావుడి చేయడం తప్పితే ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమా లు చేపట్టడంలో నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నారు. జూన్ 2 నుంచి వంద రోజుల ప్రణాళికను పక్కాగా అమలు చేయాలనే ఆదేశాలు ఉన్నప్పటికీ అధికారులు తూతూమంత్రంగా చేపడుతుండటంతో స్వచ్ఛ ఆశయం మరుగున పడుతోంది. ప్రజలకు స్వచ్ఛతపై అవగాహన కల్పించడం, వారితో కలిసి శ్రమదానం చేయడంతో పాటు ప్లాస్టిక్ నిర్మూలన, తడి, పొడి చెత్త వేరు చేసే విధానం, మరుగుదొడ్ల వినియోగం తదితర అంశాలను ప్రజలకు వివరిస్తూ చైతన్యపర్చాలి. వారితో అధికారులు ప్రతిజ్ఞ చేయించాల్సి ఉంది. ఒకటి, రెండుచోట్ల మొ క్కుబడిగా సమావేశాలు నిర్విహించడం మిగతా చోట్ల ఎలాంటి పురోగతి కనిపించకపోవడం గమనార్హం.
కొత్త
కాలనీల్లో..
వేధిస్తున్న సిబ్బంది కొరత..
పురపాలిక వార్డులు జనాభా పారిశుద్ధ్య కార్మికులు
వనపర్తి 33 70,416 150
పట్టణంలో ఏర్పడిన కొత్త కాలనీల్లో మురుగు కాల్వలు, రహదారులు లేక రోడ్లు ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు. ఖాళీ స్థలాల్లో వర్షపు నీరు, మురుగు నిలిచి చెరువులను తలపిస్తున్నాయి. దీనికితోడు పిచ్చిమొక్కలు ఏపుగా పెరిగాయి.
అంతర్గత వీధుల్లో రహదారులపై పారుతున్న మురుగు
వంద రోజుల ప్రణాళిక అమలులోనూ నిర్లక్ష్యం
తూతూమంత్రంగా పనులు
పట్టించుకోని అధికారులు

పురం.. అధ్వానం

పురం.. అధ్వానం