ప్రజాస్వామ్య రక్షణే ‘జై సంవిధాన్‌’ లక్ష్యం | - | Sakshi
Sakshi News home page

ప్రజాస్వామ్య రక్షణే ‘జై సంవిధాన్‌’ లక్ష్యం

Jul 1 2025 3:54 AM | Updated on Jul 1 2025 3:54 AM

ప్రజాస్వామ్య రక్షణే ‘జై సంవిధాన్‌’ లక్ష్యం

ప్రజాస్వామ్య రక్షణే ‘జై సంవిధాన్‌’ లక్ష్యం

పాన్‌గల్‌: ప్రజాస్వామ్య రక్షణే జై బాపు, జై భీమ్‌, జై సంవిధాన్‌ లక్ష్యమని రాష్ట్ర ఎకై ్సజ్‌, పర్యాటకశాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. జై బాపు, జై భీమ్‌, జై సంవిధాన్‌ పాదయాత్ర సోమవారం మండలంలోని మల్లాయిపల్లి, చింతకుంటలో సాగింది. ఈ సందర్భంగా మంత్రి ఆయా గ్రామాల్లోని అంబేడ్కర్‌ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించి మాట్లాడారు. రాజ్యాంగాన్ని పరిరక్షించే బాధ్యత అందరిపై ఉందని.. మహాత్మాగాంధీ వారసత్వం, డా. బీఆర్‌ అంబేడ్కర్‌ రచించిన రాజ్యాంగాన్ని కాపాడుకోవడమే లక్ష్యంగా జై సంవిధాన్‌ యాత్ర చేపడుతున్నట్లు పేర్కొన్నారు. దేశ రాజ్యాంగం అమలులోకి వచ్చి 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా రాజ్యాంగ విలువలపై ప్రజలకు అవగాహన కల్పించడమే లక్ష్యంగా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు చెప్పారు. గాంధీ, అంబేడ్కర్‌ ఆశయాలను స్ఫూర్తిగా తీసుకొని బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతికి సీఎం రేవంత్‌రెడ్డి సారథ్యంలోని కాంగ్రెస్‌ ప్రభుత్వం నిరంతరం శ్రమిస్తుందన్నారు.

అర్హులందరికీ రైతు భరోసా..

రైతు భరోసా అందని రైతులు ఆందోళన చెందవద్దని.. గ్రామాల వారీగా అర్హుల వివరాలు సేకరించి న్యాయం చేస్తామని మంత్రి జూపల్లి తెలిపారు. సోమవారం మండల కేంద్రానికి వచ్చిన మంత్రికి సీపీఎం మండల కార్యదర్శి బాల్యానాయక్‌ ఆధ్వర్యంలో వివిధ గ్రామాల రైతులు అర్హత ఉన్న రైతు భరోసా రాలేదని.. మంజూరు చేయించాలని కోరుతూ వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. రాష్ట్రవ్యాప్తంగా 1.50 కోట్ల ఎకరాలకుగాను ఇప్పటి వరకు 1.46 కోట్ల ఎకరాలకు రైతు భరోసా జమ చేసినట్లు తెలిపారు. 9 రోజుల్లో రూ.9 వేల కోట్ల రైతు భరోసా నిధులు రైతుల ఖాతాల్లో జమ చేసిన ఘనత కాంగ్రెస్‌ ప్రభుత్వానిదేనన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement