
కేంద్ర పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి : బీజేపీ
వనపర్తి రూరల్: ప్రధాని మోదీ ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత పార్టీ నాయకులు, కార్యకర్తలపై ఉందని బీజేపీ జిల్లా అఽధ్యక్షుడు నారాయణ అన్నారు. సోమవారం మండలంలోని చందాపూర్‌లో పార్టీ మండల అధ్యక్షుడు సందా వెంకటేష్ అధ్యక్షతన జరిగిన రచ్చబండ కార్యక్రమానికి ఆయనతో పాటు జెడ్పీ మాజీ చైర్మన్ ఆర్.లోక్‌నాథ్‌రెడ్డి, అయ్యంగారి ప్రభాకర్‌రెడ్డి, పురుషోత్తంరెడ్డి తదితరులు ముఖ్యఅతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బేటీ పడావో.. బేటీ బచావో పథకంతో మొదలుకొని పేదలకు మరుగుదొడ్ల నిర్మాణం, రాయితీ గ్యాస్ సిలిండర్లు, ఆయుష్మాన్ భారత్, ఉచిత బియ్యం ఇలా అనే పథకాలను కేంద్రం అమలు చేస్తోందన్నారు. ఈ సందర్భంగా వారు పంచాయతీ కార్మికులను సన్మానించారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు రామన్నగారి వెంకటేశ్వర్‌రెడ్డి, నియోజకవర్గ కన్వీనర్ శ్రీనివాస్‌గౌడ్, కుమారస్వామి, బాలరాజు, వాకిటి సుదర్శన్, చిన్న నర్సింహ, రాఘవేందర్, శివ, రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.