
రెన్యువల్‌కు రాశాం..
కేంద్ర ప్రభుత్వం నుంచి జిల్లాకు రూ.86 లక్షలు మంజూరయ్యాయి. ఆర్థిక సంవత్సరం చివరలో నిధులు రావడంతో సమయానికి లబ్ధిదారుల ఎంపిక చేయలేదు. దీంతో ప్రస్తుత 2025– 26 ఆర్థిక సంవత్సరంలో ఇచ్చేందుకు కేంద్రానికి రెన్యువల్ కోసం లేఖ రాశాం. రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ పథకాన్ని పునరుద్ధరించి నిధులు ఇస్తామని ప్రకటించింది. – చంద్రశేఖర్,
జిల్లా వ్యవసాయాధికారి, నాగర్‌కర్నూల్
రాయితీపై ట్రాక్టర్లు ఇవ్వాలి..
గతంలో రైతులకు సబ్సిడీపై ట్రాక్టర్లు ఇచ్చేవారు. కొన్నేళ్లుగా ఇవ్వడం లేదు. ప్రభుత్వం రాయితీపై ట్రాక్టర్లు, యంత్ర పరికరాలు ఇస్తే అన్నదాతలకు ఎంతో ఊరట కలుగుతోంది. పంటల సాగుకు ఖర్చు తగ్గుతుంది.
– కదిరే కృష్ణయ్య, రైతు, ఉప్పునుంతల
దున్నడానికే రూ.11 వేలు..
ఏటా సాగు ఖర్చు పె రుగుతోంది. ట్రాక్టర్లపై ఆధారపడాల్సి వస్తోంది. ఎద్దులతో చేద్దా మంటే వాటిని మేపేందుక ు మేత లేదు. ఎక రా సాగుకు రూ.25 వేల పెట్టుబడి అయితే అ ందులో రూ.11 వేలు దున్నడానికే పోతోంది.
– పుల్యానాయక్, రైతు, గుట్టమీది తండా

రెన్యువల్‌కు రాశాం..

రెన్యువల్‌కు రాశాం..