రాష్ట్రస్థాయి చెస్‌ పోటీలకు 8 మంది ఎంపిక | - | Sakshi
Sakshi News home page

రాష్ట్రస్థాయి చెస్‌ పోటీలకు 8 మంది ఎంపిక

May 20 2025 12:54 AM | Updated on May 20 2025 12:54 AM

రాష్ట

రాష్ట్రస్థాయి చెస్‌ పోటీలకు 8 మంది ఎంపిక

వనపర్తి టౌన్‌: జిల్లాకేంద్రంలోని ఇండోర్‌ స్టేడియంలో జిల్లా చెస్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో సోమవారం అండర్‌–9, 11 విభాగంలో జిల్లాస్థాయి క్రీడాకారుల ఎంపిక పోటీలు నిర్వహించారు. అండర్‌–9 విభాగంలో 20 మంది, అండర్‌–11 విభాగంలో 18 మంది క్రీడాకారులకు నాలుగు విడతలు పోటీలు జరిగాయి. ఈ పోటీలకు ఆర్బిటర్‌ (కోచ్‌)లుగా కె.శివకుమార్‌, హర్షవర్ధన్‌ వ్యవహరించారు. ముగింపు కార్యక్రమానికి చెస్‌ అసోసియేషన్‌ జిల్లా అధ్యక్షుడు యాదగిరి, ప్రధానకార్యదర్శి మండ్ల వేణుగోపాల్‌, కోశాధికారి టీపీ కృష్ణయ్య హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. మేధస్సుకు పదునుపెట్టే చెస్‌ క్రీడకు జిల్లాను కేరాఫ్‌గా మార్చాలనే లక్ష్యంతో అసోసియేషన్‌ పని చేస్తుందని చెప్పారు. రాష్ట్రస్థాయి పోటీల్లో జిల్లా క్రీడాకారులు ప్రతిభ చాటాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికై న క్రీడాకారులకు జ్ఞాపికలు అందజేసి అభినందించారు. కార్యక్రమంలో సంయుక్త కార్యదర్శి రాములు, ప్రచార కార్యదర్శి సుధాకర్‌, ఈసీ మెంబర్‌ మోహన్‌బాబు (యేబు) తదితరులు పాల్గొన్నారు.

రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికై న క్రీడాకారులు..

ఈ నెల 23, 24 తేదీల్లో హైదరాబాద్‌లోని ఎల్‌బీ స్టేడియంలో జరిగే రాష్ట్రస్థాయి పోటీలకు అండర్‌–9 బాలికల విభాగంలో వైష్ణవి రత్న, జె.చైత్రాంగణ, బాలుర విభాగంలో డి.సిద్ధార్థ్‌, అండర్‌–11 బాలికల విభాగంలో పాశం కార్తీక, సాన్వి శ్రీ, బాలుర విభాగంలో ఆరుష్‌రెడ్డి, జి.శ్రీహాన్‌ ఎంపికయ్యారు.

‘తరుగు పేరుతో తూకాల్లో కోతలు సరికాదు’

వనపర్తి: మిల్లర్లు తరుగు పేరుతో ధాన్యం తూకాల్లో కోతలు విధిస్తూ రైతులను మోసం చేస్తున్నారని.. ఈ అంశంపై ఇటీవల రాష్ట్ర అబ్కారీ, పర్యాటకశాఖ మంత్రి జూపల్లి, ఎమ్మెల్యేలు తూడి మేఘారెడ్డి, మధుసూదన్‌రెడ్డి సమీక్ష నిర్వహించి సూచనలు చేసినా మార్పు లేదని బీసీ పొలిటికల్‌ జేఏసీ చైర్మన్‌ రాచాల యుగంధర్‌గౌడ్‌ సోమవారం రెవెన్యూ అదనపు కలెక్టర్‌ జి.వెంకటేశ్వర్లుకు ఫిర్యాదు చేశారు. అనంతరం కలెక్టరేట్‌ ఆవరణలో చిట్యాల రైతులకు జరిగిన అన్యాయంపై ట్రక్‌షీట్ల ప్రతులతో తూకాల్లో విధించిన కోతలను వివరించారు. అలాగే రైతు బాలస్వామిని అధికారుల ముందుకు తీసుకొచ్చి మిల్లర్లు చేస్తున్న అన్యాయాన్ని వెల్లడించారు. కొనుగోలు కేంద్రాల్లోనే 40 కిలోల సంచికి 1.50 కిలోలు అదనంగా తూకం చేస్తున్నా.. మిల్లర్లు కోత విధించడం రైతులను దోపిడీ చేయడమేనని మండిపట్టారు. అధికారులు స్పందించకుంటే ఆందోళన బాట పడతామని హెచ్చరించారు. అలాగే డీఎస్‌ఓ కార్యాలయంలో ఓ వ్యక్తి ఎలాంటి నియామక పత్రాలు లేకుండా కొన్ని నెలలుగా పని చేస్తూ రూ.కోట్ల విలువైన ధాన్యం కేటాయింపు ఉత్తర్వులు తయారు చేస్తున్నారని.. అతడి హోదా ఏమిటనే విషయం కలెక్టర్‌, అదనపు కలెక్టర్‌ వెల్లడించాలని కోరారు. ఆయన వెంట స్థానిక, జిల్లా నాయకులు పలువురు ఉన్నారు.

గొప్ప నాయకుడు

పుచ్చలపల్లి సుందరయ్య

వనపర్తి రూరల్‌: నీతి నిజాయితి, కమ్యూనిస్ట్‌ విలువలను కాపాడిన గొప్ప నాయకుడు పుచ్చలపల్లి సుందరయ్య.. ఆయనను స్మరించుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యతని సీపీఎం జిల్లా కార్యదర్శి పుట్టా ఆంజనేయులు అన్నారు. సోమవారం జిల్లాకేంద్రంలోని పార్టీ కార్యాలయంలో పార్టీ పట్టణ కార్యదర్శి పరమేశ్వరాచారి అధ్యక్షతన కామ్రేడ్‌ పుచ్చలపల్లి సుందరయ్య వర్ధంతి కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వారితో పాటు పార్టీ జిల్లా నాయకులు పాల్గొని ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా పుట్టా ఆంజనేయులు మాట్లాడుతూ.. పుచ్చలపల్లి సుందరయ్య పేదల అభ్యున్నతికి పరితపించారని.. ఆయన ఆశయమైన సోషలిజం కోసం దీర్ఘకాలం పోరాటం చేయడానికి సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. కురుమయ్య, బాలస్వామి, మదన్‌, గట్ట య్య, బీసన్న, రమేష్‌, నందిమళ్ల రాములు, ఉ మా, రాబర్ట్‌, బాలరాజు,భాస్కర్‌, కురుమయ్య, నారాయణ, ఆంజనేయులు పాల్గొన్నారు.

రాష్ట్రస్థాయి చెస్‌ పోటీలకు 8 మంది ఎంపిక 
1
1/2

రాష్ట్రస్థాయి చెస్‌ పోటీలకు 8 మంది ఎంపిక

రాష్ట్రస్థాయి చెస్‌ పోటీలకు 8 మంది ఎంపిక 
2
2/2

రాష్ట్రస్థాయి చెస్‌ పోటీలకు 8 మంది ఎంపిక

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement