
అవగాహన కల్పిస్తున్నాం..
యంగ్ ఇండియా కార్యక్రమంలో భాగంగా పాఠశాలల్లో నిర్వహిస్తున్న సమ్మర్ క్యాంపులను సద్వినియోగం చేసుకోవాలని విద్యార్థులకు సూచిస్తున్నాం. హెచ్‌ఎంలు, ఉపాధ్యాయులు తల్లిదండ్రులను కలిసి తమ పిల్లలను క్యాంపులకు పంపించేలా అవగాహన కల్పిస్తున్నాం. వేసవి దృష్ట్యా ఉదయం 8:30 నుంచి 11:30 గంటల వరకు క్యాంపు నిర్వహణ ఉంటుంది.
– భాస్కర్ సింగ్. ఎంఈఓ, అమరచింత
నైపుణ్యాల పెంపు..
వేసవి సెలవుల్లో వి ద్యార్థులు ఇతర వ్యాపకాలకు గురికాకుండా పాఠశాల వాతావరణంలో ఉంటూ సాంస్కృతిక కార్యక్రమాలు, ఆటపాటల్లో గడిపేందుకు వేసవి శిక్షణ శిబిరాలను నిర్వహిస్తున్నాం. ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లాలో 50 ఉన్నత పాఠశాలల్లో శిబిరాలను కొనసాగించేందుకు ప్రణాళిక రూపొందించాం. ఇప్పటి వరకు 35 శిక్షణ శిబిరాలను ప్రారంభించాం.వలంటీర్లను నియమించి శిక్షణకు హాజరవుతున్న వారికి రోజువారీ అల్పాహారం అందిస్తున్నాం.
– అబ్దుల్ ఘని, డీఈఓ

అవగాహన కల్పిస్తున్నాం..