
శిక్షణ శిబిరాలను వినియోగించుకోవాలి
వనపర్తి రూరల్: యంగ్ ఇండియా శిక్షణ శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలని అకాడమిక్ మానిటరింగ్ అధికారి మహానంది కోరారు. సోమవారం పెబ్బేరు మండలం యాపర్ల జెడ్పీ ఉన్నత పాఠశాలలో కొనసాగుతున్న శిక్షణ శిబిరాన్ని ఆయన సందర్శించి మాట్లాడారు. ప్రాథమిక, ఉన్నత విద్య అభ్యసించే విద్యార్థుల కోసం వేసవి సెలవుల్లో 40 రోజుల పాటు వేసవి శిబిరాలు నిర్వహిస్తునట్లు తెలిపారు. చిన్నారులకు స్పోకెన్ ఇంగ్లీష్, గణితంలో బేసిక్స్, ఇతర సబ్జెక్టులతో పాటు చెస్, కార్యమ్స్, టెన్నీస్, గ్రామీణ ఆటల్లో శిక్షణ ఇవ్వనున్నట్లు చెప్పారు. ఆయా సబ్జెక్టుల్లో నిపుణులైన ఉపాధ్యాయులను నియమించామన్నారు. శిబిరంలో 90 మంది విద్యార్థులు ఉండటం అభినందించదగ్గ విషయమన్నారు. కార్యక్రమంలో హెచ్‌ఎం శంకర్‌గౌడ్, ఎంపీటీసీ మాజీ సభ్యుడు నరేందర్‌రెడ్డి, స్వరాజ్యం, బాబురెడ్డి, ఉపాధ్యాయులు మైనుద్దీన్, ఈశ్వర్, స్వచ్ఛంద సేవకులు అనూష, కవిత, సరిత, శివాని గ్రామస్తులు పాల్గొన్నారు.