
‘చిన్నోనిపల్లి’ లింక్‌కు నో..
ఈ వివాదం నడుస్తున్న క్రమంలో ఆర్డీఎస్ కెనాల్‌కు చిన్నోనిపల్లి రిజర్వాయర్‌కు లింక్ చేసే ప్రతిపాదనలను ఎంపీ తెరపైకి తీసుకొచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. కృష్ణానీటిపై ఆధారపడి గట్టు మండలంలో చిన్నోనిపల్లె రిజర్వాయర్ తెరపైకి వచ్చింది. తుంగభద్ర నీటి ఆధారంగా వడ్డేపల్లి మండలం తనగల సమీపంలో మల్లమ్మకుంట నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. తుంగభద్ర నదికి వరదలు వచ్చినప్పుడే కాకుండా వర్షపు నీటితో కూడా ఆధారపడి నిర్మించే ఈ రిజర్వాయర్‌లో నీరు నిల్వ చేసుకుంటే తమకు ప్రయోజనం ఉంటుందని అలంపూర్ నియోజకవర్గానికి చెందిన రైతులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. తుంగభద్ర నదిలో నీరు లేని సమయంలోనూ ఆర్‌డీఎస్ కెనాల్ ద్వారా వడ్డేపల్లి, మానవపాడు, ఉండవెళ్లి, అలంపూర్,రాజోళి మండలాల్లోని చివరి ఆయకట్టు భూములకు సాగు నీరందే అవకాశం ఉంటుందని.. చిన్నోనిపల్లి ద్వారా ఇది సాధ్యం కాదని.. తాము ఒప్పుకునేది లేదని చెబుతున్నారు.
మల్లమ్మకుంట రిజర్వాయర్ నిర్మిస్తే అలంపూర్ నియోజకవర్గంలోని 55 వేల ఎకరాల ఆయకట్టుకు, పదివేల ఎకరాల నాన్‌ఆయకట్టుకు పూర్తిస్థాయిలో సాగునీరందుతుంది. అలంపూర్ సస్యశ్యామలమవుతుంది. దీన్ని రద్దు చేయడం వల్ల కేవలం 400 ఎకరాల రైతులకు మాత్రమే మేలు జరుగుతుంది. మల్లమ్మకుంట రిజర్వాయర్ రద్దు మంచిది కాదు. నష్టపోతున్న రైతులకు మార్కెట్ ధర ప్రకారం ఎకరాకు రూ.25 లక్షలు చెల్లించాలి. సాటి రైతులు కూడా అడ్డుకునే పరిస్థితి ఉండదు.
– సీతారామిరెడ్డి, ఆర్డీఎస్ మాజీ చైర్మన్,
రిజర్వాయర్ రద్దు మంచిది కాదు..