
వాహన తనిఖీల్లో అధికారులు
● ఆర్టీఏ శాఖకు ఈ ఆర్థిక సంవత్సరంలో లక్ష్యానికి మించి ఆదాయం వచ్చింది. ప్రధానంగా రవాణా వాహనాల నుంచి త్రైమాసిక పన్ను వసూలు చేయడం కోసం ఫిబ్రవరి 15 నుంచి మార్చి 31 వరకు ప్రత్యేక డ్రైవ్ ఏర్పాటు చేసి 270 కేసులు నమోదు చేసి రూ.59.09 లక్షల జరిమానా వసూలు చేశారు. అలాగే ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు నిర్వహించడంతో వాహనదారులు స్వచ్ఛందంగా ముందుకొచ్చి రూ.1.14 కోట్ల పన్ను కట్టారు. కేవలం రెండు నెలల వ్యవధిలో 1,633 వాహనాల నుంచి త్రైమాసిక పన్ను రూ.2.02 కోట్లు వసూలు చేశారు. తనిఖీల్లో ప్రభుత్వం రూ.1.58 కోట్ల లక్ష్యం ఇవ్వగా.. రూ. 1.35 కోట్లు వసూలు చేశారు.