
పాలమూరు/వనపర్తి: ఈ ఏడాది ప్రధాన శాఖల నుంచి ప్రభుత్వానికి భారీగా ఆదాయం సమకూరింది. కరోనాతో రెండేళ్లు ఆశించిన స్థాయిలో రాబడి లేకున్నా.. ఈ ఏడాది ఆర్టీఏ, రిజిస్ట్రేషన్ల శాఖలు బాగా పుంజుకున్నాయి. రిజిస్ట్రేషన్ శాఖకు ఉమ్మడి జిల్లావ్యాప్తంగా 1,02,069 డాక్యుమెంట్లు రిజిస్ట్రేషన్ చేయగా.. వాటి ద్వారా రూ.243.02 కోట్ల ఆదాయం వచ్చింది. వనపర్తి ఆర్టీఏ శాఖకు ఈ ఆర్థిక సంవత్సరం రూ.32.44 కోట్ల లక్ష్యం ఇవ్వగా రూ.37.18 కోట్లు వచ్చింది. ఇక ఎకై ్సజ్‌శాఖలో గతేడాది కంటే ఉమ్మడి జిల్లాలో కొంత మద్యం అమ్మకాలు తగ్గా యి. దీంతో 230మద్యం దుకాణాల పరిధిలో ఐఎంఎల్ 26,00,443 కేసులు, బీరు 34,11,700 కేసుల ద్వారా రూ.2,516.24 కోట్ల విక్రయాలు జరిగాయి.
రూ.33కోట్ల ఆదాయం పెరిగింది
మహబూబ్‌నగర్ న్యూటౌన్: ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలోని 12 సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయాల పరిధిలో జరిగిన లావాదేవీలపై ఈ సంవత్సరం ప్రభుత్వానికి భారీగా ఆదాయం సమకూరింది. మొత్తం 1,02,069 డాక్యుమెంట్లు రిజిస్ట్రేషన్‌లు కాగా 2022–23 ఆర్థిక సంవత్సరానికి రూ.243. 02 కోట్ల ఆదాయం నమోదైంది. గత ఆర్థీక సంవత్సరం 2021–22లో రూ.210.27కోట్ల ఆదాయ ం రాగా ఈసారి దాదాపు రూ.33కోట్లు పెరిగింది.
ఈ ఏడాది ప్రభుత్వఖజానాకు కాసుల గలగల
ఆర్టీఏలో లక్ష్యానికి మించిన రాబడి
రిజిస్ట్రేషన్ల ద్వారా రూ.243 కోట్ల ఆదాయం
ఎకై ్సజ్ శాఖలో రూ.2,516.24 కోట్లమద్యం విక్రయాలు