
రెండోరోజూ అధికారపార్టీ సభ్యుల గైర్హాజరు
●
స్థానిక సంస్థల వ్యవస్థను
నిర్లక్ష్యం చేయడమే..
ప్రజా సంక్షేమాన్ని పక్కనబెట్టి రాజకీయాల కోసం మూడునెలలకు ఒకసారి జరిగే సర్వసభ్య సమావేశానికి రాకపోవటం స్థానిక సంస్థల వ్యవస్థను నిర్లక్ష్యం చేయటమే. వివిధ కేటగిరీల్లో చేపట్టాల్సిన పనులకు తీర్మానాలు చేయకుంటే జిల్లాకు రావాల్సిన సుమారు రూ.10 కోట్లు ఆగిపోనున్నాయి. ‘కంటివెలుగు’లో పనిచేస్తున్న వైద్యులు, సిబ్బందికి వేతనాలు ఇవ్వడానికి సైతం నిబంధనలు అడ్డొస్తాయి.. గమనించాల్సిన అవసరం ఉంది.
– రాజేంద్రప్రసాద్,
జెడ్పీటీసీ సభ్యుడు, శ్రీరంగాపూర్
వనపర్తి: అభివృద్ధిని కాంక్షించి ఓట్లు వేసి గెలిపించిన ప్రజల ప్రయోజనాలను పక్కనబెట్టి.. పట్టుదలకే అధిక ప్రాధాన్యమిస్తూ అధికార పార్టీ జెడ్పీటీసీ సభ్యులు రెండోరోజూ జెడ్పీ సర్వసభ్య సమావేశానికి గైర్హాజరయ్యారు. బుధవారం ఉదయం 10.30కి సమావేశం నిర్వహిస్తామని మంగళవారం వాయిదా వేసిన జెడ్పీ చైర్మన్ ఆర్.లోక్‌నాథ్‌రెడ్డి సైతం డుమ్మా కొట్టడం శోచనీయం. ముందుగా ప్రకటించిన తేదీన కోరం లేక సమావేశాన్ని మరుసటి రోజుకు వాయిదా వేసిన విషయం తెలుసుకొని బుధవారం జిల్లాలోని ఏకై క ప్రతిపక్ష జెడ్పీటీసీ సభ్యుడు రాజేంద్రప్రసాద్ ఒక్కరే సమావేశానికి రావటంతో చేసేది లేక జెడ్పీ సమావేశాన్ని నిరవధిక వాయిదా వేస్తున్నట్లు జెడ్పీ సీఈఓ బి.శ్రావణ్‌కుమార్ ప్రకటించారు. జెడ్పీ కార్యాలయ సమావేశ మందిరంలో సమావేశం నిర్వహించేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. కేవలం ఒకేఒక్క జెడ్పీటీసీ సభ్యుడు హాజరుకావడంతో ఖాళీ కుర్చీలే దర్శనమిచ్చాయి.
● 15వ ఆర్థిక సంఘం నిధులతో చేపట్టే అభివృద్ధి పనుల తీర్మానం వివరాలను ప్రభుత్వానికి పంపించకుంటే గ్రాంట్ విడుదలయ్యే అవకాశం ఉండదు. స్వార్థ రాజకీయాలతో జిల్లా అభివృద్ధి కుంటుపడుతుందనే విషయాన్ని ప్రజాప్రతినిధులు గుర్తించకపోవటమేమిటనే ప్రశ్నలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి.
అధికారుల సమయం వృథా..
జెడ్పీ సమావేశం పేరుతో సుమారు 40 ప్రభుత్వ శాఖల అధికారులు రెండురోజుల పాటు కార్యాలయంలో అందుబాటులో లేరు. జెడ్పీ కార్యాలయానికి రావటం.. వాయిదాల ప్రకటనతో తిరిగి వెళ్లిపోవటంతో విలువైన అఽధికారుల సమయం వృథా అయిందన్న వాదనలు వినిపిస్తున్నాయి.
కోరం లేక జెడ్పీ సమావేశం
నిరవధిక వాయిదా
ప్రకటించిన
జెడ్పీ సీఈఓ శ్రావణ్‌కుమార్
నిధుల వినియోగం
తీర్మానాలు బుట్టదాఖలు

బుధవారం కూడా ఖాళీ కుర్చీలతో దర్శనమిస్తున్న జెడ్పీ సమావేశ మందిరం