● రాష్ట్ర రజక కార్పొరేషన్ చైర్‌పర్సన్ సావిత్రి
విజయనగరం క్రైమ్: చైతన్యంతోనే రజకుల అభివృద్ధి సాధ్యమని ఏపీ రజక అభివృద్ధి,సంక్షేమ కార్పొరేషన్ చైర్‌పర్సన్ సావిత్రి అన్నారు. ఈ మేరకు బుధవారం ఊటగడ్డ చాకిరేవులో రజక సంఘాల ఐక్యవేదిక నిర్వహించిన ఆత్మీయ సమావేశంలో పాల్గొన్న రాష్ట్ర రజక సంక్షేమ అండ్ అభివృద్ధి కార్పొరేషన్ చైర్‌పర్సన్ సావిత్రి మాట్లాడుతూ తరతరాలుగా అణిచివేతకు గురవుతున్న రజకుల సంక్షేమం, అభివృద్ధి చైతన్యం పొందడం ద్వారా మాత్రమే.సాధ్యమని ఉద్బోధించారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రజకుల అభివృద్ధి కోసం అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టాయని సరైన చైతన్యం లేక వాటిని రజకులు సద్వినియోగం చేసుకోలేకపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు, క్షేత్రస్థాయిలో రజకులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించే లక్ష్యంతో వారిని చైతన్యం చేసే ఉద్దేశంతో రాష్ట్రవ్యాప్త పర్యటనలో భాగంగా విజయనగరం జిల్లాలో పర్యటిస్తున్నామని తెలిపారు రజకులు సంఘ చైతన్యంతో తమ హక్కులను కాపాడుకోవడానికి ముందుకు రావాలని అందుకు తమ అండదండలు అందిస్తామని తెలియజేశారు. ఈ సమావేశంలో జిల్లా రజక సంఘాల ఐక్యవేదిక నాయకులు గురజాపు సత్యారావు కెల్లసత్యం. మద్ది పైడిరాజు తామాడ అచ్చన్న రాయవలస వెంకటరమణ గోవింద్ వెల్దుర్తి నాగరాజు జిల్లా రజక వెల్ఫేర్ కమిటీ సభ్యులు. జొన్నాడశ్రీనివాస రావు కొత్తకోట శ్రీనివాసరావు, తాళ్ల,వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు. క్షేత్రస్థాయి పర్యటనలో బుధవారం ఆమె ఉదయం 8గంటల నుంచి 10:30 వరకు పుల్లయ్య కోనేరు. రోళ్లవాక. గజపతినగరం. దోబీ ఘాట్లను పరిశీలించి రజకులతో చర్చించారు. వినతి పత్రాలు స్వీకరించారు అకస్మాత్తుగా మృతిచెందిన వెల్దుర్తి గౌరినాయుడు, కందివలస ఉమామహేశ్వరరావు కుటుంబాలను. పరామర్శించి ఓదార్చారు. ప్రభుత్వం నుంచి సహాయం అందేవిధంగా చూస్తామని పేర్కొన్నారు.
రజకులను ఎస్సీ జాబితాలో చేర్చాలి
విజయనగరం: రజకులను ఎస్సీ జాబితాలో చేర్చాలని జిల్లా రజక సంక్షేమ సంఘం అధ్యక్షుడు తంగేటి భాస్కరరావు డిమాండ్ చేశారు. ఈ మేరకు బుధవారం జిల్లా పర్యటనకు వచ్చిన రాష్ట్ర రజక ఫెడరేషన్ చైర్‌పర్సన్ సావిత్రికి వినతిపత్రం అందజేశారు. కూటమి ప్రభుత్వం రజకులను ఎస్సీ జాబితాలో చేరుస్తామని హమీ ఇచ్చి అమలు చేయడం లేదన్నారు. ఎన్నో ఏళ్లుగా ఇదే సమస్యపై ప్రభుత్వాలకు విన్నవించుకుంటున్నా ఫలితం లేకపోతోందని ఆవేదన వ్యక్తం చేశారు. 2024 ఎన్నికలకు ముందు ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు రజకులను ఎస్సీ జాబితాలో చేర్చుతామని హమీ ఇచ్చారని గుర్తు చేశారు. ఇచ్చిన మాట ప్రకారం రజకులకు న్యాయం చేసి ఆర్ధికంగా, సామాజికంగా ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో సంఘం జిల్లా కార్యదర్శి జంప చిన్న, ఉపాధ్యక్షుడు శీల తాతారావు, నగర గౌరవ అధ్యక్షుడు ఈశ్వరరావు, పైడి చిట్టి, అప్పలరాజు, సతీష్, సింహాచలం, శ్రీను, అప్పలరాజు తదితరులు పాల్గొన్నారు.


