ఇదెక్కడి తీరు ‘బాబూ’..!
చీపురుపల్లి:
ఒకే ఒక్క యూరియా బస్తా కోసం వేలకు వేలు ఖర్చు చేయాలంటే ఎక్కడి నుంచి అప్పులు తేవాలి?.. వ్యవసాయం ఎలా చేయాలి?.. పంటలు పండించొద్దు అంటే చెప్పండి.. మానేస్తాం... కానీ ఇలా బస్తా యూరియా కోసం వేలకువేలు ఖర్చు చేయలేం.. ఇదెక్కడి అన్యాయం ‘బాబూ’ అంటూ రైతులు ఆవేదన వ్యక్తంచేశారు. ఎరువుల కోసం ఇన్నిపాట్లా అంటూ నిట్టూర్చారు. చీపురుపల్లి పట్టణంలోని శివరాం రోడ్డులో ఉన్న మనగ్రోమోర్ కేంద్రం వద్ద బుధవారం యూరియా కోసం వచ్చిన రైతులకు చేదు అనుభవం ఎదురైంది. యూరియా కావాలంటే పొటాష్, డీఏపీ, గడ్డి మందు కొనుగోలుచేయాలని, లేదంటే యూరియా ఇవ్వమని అక్కడి సిబ్బంది చెప్పడంతో రైతులు ఖంగుతిన్నారు. కొద్ది రోజుల కిందట నాలుగైదు వేలు వెచ్చించి మనగ్రోమోర్ సిబ్బంది చెప్పినవన్నీ కొనుగోలు చేశామని, అయినప్పటికీ యూరియా ఇవ్వడం లేదంటూ బిల్లుల తీసుకుని వచ్చిన మరికొందరు రైతులు ఆగ్రహం వ్యక్తంచేశారు. డీఏపీ, పొటాష్, గడ్డి మందు కొనుగోలు చేసిన వారికి కూడా యూరియా ఇవ్వకపోవడంతో వారంతా ఆందోళనకు దిగారు. చంద్రబాబు ప్రభుత్వంలో రైతన్న కష్టాలపై ఏకరువుపెట్టారు. రైతంటే గౌరవం పోయిందంటూ వాపోయారు. విషయం తెలుసుకున్న వ్యవసాయశాఖ ఏడీ ఎన్.కోటేశ్వరరావు, ఏఓ సూర్యకుమారి దుకాణం వద్దకు చేరుకున్నారు. ఏఓ సూర్యకుమారి స్వయంగా మనగ్రోమోర్ కౌంటర్‌లో కూర్చుని రైతులకు ఎలాంటి అదనపు కొనుగోళ్లు లేకుండా యూరియా పంపిణీ చేశారు. రైతులకు ఇబ్బందులు లేకుండా చూస్తామని స్పష్టంచేశారు.
బస్తా యూరియా కోసం పొటాష్,
గడ్డి మందు కొనుగోలు చేయాలా?
వాటికోసం వేల రూపాయలు
ఖర్చుపెట్టాలా?
చీపురుపల్లిలో రైతుల ఆందోళన
ఎరువుల దుకాణదారు తీరుపై ఆగ్రహం
ఇదెక్కడి తీరు ‘బాబూ’..!
ఇదెక్కడి తీరు ‘బాబూ’..!


