క్లాట్‌లో బొబ్బిలి కుర్రాడి ప్రతిభ
బొబ్బిలి: పట్టణానికి చెందిన వేమిరెడ్డి నితిన్ చంద్ర మంగళవారం విడుదలైన క్లాట్ (కామన్ లా అడ్మిషన్ టెస్ట్–26) ఫలితాల్లో జాతీయ స్థాయిలో 90వ ర్యాంకు సాధించాడు. ఓబీసీలో 5వ ర్యాంకును సొంతం చేసుకున్నాడు. క్లాట్‌లో కుమారుడు ప్రతిభ చూపడంతో తల్లిదండ్రులు శ్యామల, బాబూరావు సంతోషం వ్యక్తంచేశారు. పట్టణ వాసులు, విద్యావేత్తలు, న్యాయవాదులు నితిన్‌చంద్రను అభినందించారు. అంతర్జాతీయ గుర్తింపు పొందిన బెంగళూరు లా యూనివర్సిటీలో మాస్టర్స్ లా చేసి ప్రజలకు న్యాయ సేవలందించడమే ఆశయమని నితిన్ తెలిపాడు.
పశుగ్రాస కేంద్రాల ఏర్పాటుకు ప్రతిపాదన
విజయనగరం అర్బన్: ప్రతి గ్రామంలో పశుగ్రాస కేంద్రాలను ఏర్పాటు చేయడం వల్ల పాడి పరిశ్రమను మరింత అభివృద్ధి చేయవచ్చని కలెక్టర్ ఎస్.రాంసుందర్‌రెడ్డి పేర్కొన్నారు. రాష్ట్ర సచివాలయంలో బుధవారం ప్రారంభమైన ముఖ్యమంత్రితో కలెక్టర్ల సమావేశంలో ఆయన ఈ ప్రతిపాదన తీసుకొచ్చారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో పశుగ్రాస కేంద్రాల ఏర్పాటువల్ల పాలఉత్పత్తి పెరగడంతో రైతులు, పాడి రైతుల ఆదాయం మెరుగుపడుతుందన్నారు. గ్రామీణ ప్రజల ఆర్థిక పరిస్థితి బలోపేతం అవుతుందని తెలిపారు.
జాతీయ స్థాయి క్విజ్ పోటీలకు వెటర్నరీ విద్యార్థులు
చీపురుపల్లిరూరల్(గరివిడి): గరివిడి శ్రీ వెంకటేశ్వర వెటర్నరీ కళాశాలకు చెందిన విద్యార్థులు క్విజ్ పోటీల్లో ప్రతిభ చూపారు. సొసైటీ ఆఫ్ యానిమల్ ఫిజియాలజిస్టు ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో హైదరాబాద్‌లో నిర్వహించిన దక్షిణ భారత క్విజ్ పోటీల్లో కళాశాలలో ద్వితీయ సంవత్సరం చదువుతున్న బి.జ్ఞాన సంధ్యారాణి, తృతీయ సంవత్సరం చదువుతున్న వి.సంజనశర్మ విజేతలుగా నిలిచి జాతీయస్థాయి పోటీలకు ఎంపికయ్యారు. విజేతలను కళాశాలలో బుధవారం నిర్వహించిన అభినందన సభలో అసోసియేట్ డీన్ మక్కేన శ్రీను అభినందించి దుశ్శాలువతో సత్కరించారు. క్విజ్ పోటీలు విద్యార్థుల మేధోశక్తికి దోహదపడతాయన్నారు. జాతీయ స్థాయి పోటీల్లో రాణించి కళాశాలకు పేరుతీసుకురావాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో విద్యార్థి వ్యవహారాల అధికారి డా.వై.ఆర్.అంబేడ్కర్, అకడమిక్ అధికారి దీపిక, డిపార్ట్‌మెంట్ హెడ్ టి.ప్రసాదరావు, గంగునాయుడు, రాజీవ్, విద్యార్థులు పాల్గొన్నారు.
మహిళల సమస్యల
పరిష్కారానికి సహకరించండి
విజయనగరం ఫోర్ట్: అంతర్జాతీయ స్థాయిలో మహిళల సమస్యల పరిష్కారానికి సహకారం అందించాలని యూఎస్ (యునైటెడ్ స్టేట్స్) ఎంబసీ ప్రతినిఽధి ఆడమ్ హాల్‌కు స్థానిక వన్ స్టాప్ సెంటర్ సిబ్బంది కోరారు. వన్‌స్టాప్ సెంటర్‌ను బుధవారం ఆడమ్ హాల్ సందర్శించా రు. వన్‌స్టాప్ సెంటర్‌లో మహిళలకు అందిస్తున్న సేవలను సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. జిల్లాకు చెందిన మహిళలకు యూఎస్ లో పాస్‌పోర్టు, వీసా, ఎంబసీ వంటి సమస్యల పరిష్కారానికి చొరవ చూపాలని సిబ్బంది ఆయనను కోరారు. మహిళలకు వసతి, రక్షణ సౌకర్యాలు కల్పించాలన్నారు. కార్యక్రమంలో అమెరికన్ సిటిజన్ సర్వీసెస్ చీఫ్ శ్రీదేవి, వన్‌స్టా ప్ అడ్మినిస్ట్రేటర్ పరవాడ సాయి విజయలక్ష్మి, ఏఎస్‌ఐ శోభారాణి, తదితరులు పాల్గొన్నారు.
క్లాట్‌లో బొబ్బిలి కుర్రాడి ప్రతిభ
క్లాట్‌లో బొబ్బిలి కుర్రాడి ప్రతిభ
క్లాట్‌లో బొబ్బిలి కుర్రాడి ప్రతిభ


