చివరిలో.. దిత్వా అలజడి
● ధాన్యం కొనుగోలు అంతంత మాత్రమే...
జొన్నవలసలో ఇలా...
తడిసి ముద్దయిన వరి పనలు
విజయనగరం ఫోర్ట్:
వరి పంట కోతకొచ్చే సమయంలో మోంథా తుఫాన్ ముంచేసింది. పంటను నేలపాలచేసింది. ఇప్పుడు కోత, పనలు, నూర్పిడి పనుల దశలో దిత్వా తుఫాన్ రైతన్న గుండెల్లో అలజడి రేపుతోంది. మొన్నటివరకు వాతావరణం బాగుండడం, జిల్లాకు తుఫాన్ ముప్పు ఉండదని భావించి వరి కోతలు యథావిధిగా సాగించారు. నూర్పిడిలు పూర్తిచేసి ధాన్యం రాశులను కళ్లాల్లోనే ఉంచారు. ఆదివారం అర్ధరాత్రి నుంచి చిరుజల్లులు కురవడంతో తీవ్ర ఆందోళనకు గురయ్యారు. వరి పంటను రక్షించుకునేందుకు సోమవారం ఉదయం పొలాలకు పరుగు తీశారు.
● 1.25 లక్షల హెక్టార్లలో వరి పంట సాగు..
జిల్లాలో వరి పంట 1.25 లక్షల హెక్టార్లలో సాగైంది. ఇందులో ఇప్పటి వరకు 60 శాతం మేర వరి కోతలు పూర్తయ్యాయి. రేగిడి ఆమదాలవలస, రాజాం, సంతకవిటి, వంగర, బొబ్బిలి, మెంటాడ, గజపతినగరం, జామి, గంట్యాడ, బొండపల్లి, రామభద్రపురం తదితర మండలాల్లో వరి పంట నూర్పులు ముమ్మరంగా జరుగుతున్నాయి. కొన్ని మండలాల్లో వరి పంట పనలపైన, కుప్పల రూపంలో ఉంది. తుఫాన్ వర్షాలకు పనలపై ఉన్న వరిపంట తడిసి ముద్దయింది. కళ్లాల్లో ఉన్న ధాన్యం రాశులు తడిచిపోకుండా కాపాడుకునేందుకు రైతులు అష్టకష్టాలు పడుతున్నారు. టార్పాలిన్లను అద్దెకు తెచ్చుకొని ధాన్యం రాశులు, కుప్పలపై కప్పుతున్నారు. వర్షాలు కురిసే సమయంలో పంట రక్షణకు ఉపయోగపడే టార్పాలిన్లను సైతం చంద్రబాబు ప్రభుత్వం రాయితీపై అందజేయలేదని రైతులు వాపోతున్నారు.
జిల్లాలో ధాన్యం కొనుగోలు అంతంత మాత్రంగానే జరుగుతుందని రైతులు చెబుతున్నారు. నూర్పుడి పూర్తయిన వెంటనే ధాన్యం కొనుగోలు చేయకపోవడంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయని వాపోతున్నారు. ఈ ఏడాది వరి దిగుబడి అంచనా 7 లక్షల మెట్రిక్ టన్నులు. ఇందులో కొనుగోలు లక్ష్యం 4 లక్షల మెట్రిక్ టన్నులు. అయితే, ఇప్పటివరకు వరి పంట నూర్పిడి చేసిన రైతుల నుంచి 45వేల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలుకు వ్యవసాయ అధికారులు షెడ్యూల్ ఇవ్వగా 35వేల మెట్రిక్ టన్నులే కొనుగోలు చేశారు. మిగిలిన 10వేల టన్నల ధాన్యం రాశుల రూపంలో కళ్లాలు, పొలాల్లోనే ఉంది. ఇంటిల్లిపాదీ ఆరుగాలం శ్రమించి సాగుచేసిన పంటను ఓ వైపు తుఫాన్ వర్షాలు తడిపేస్తుండగా.. మరోవైపు ప్రభుత్వం ఆదుకునే చర్యలు చేపట్టకుండా రైతన్నను క(న)ష్టాల్లోకి నెట్టేస్తోందంటూ రైతులు ఆవేదన చెందుతున్నారు.
వరి కుప్పలపై వేసిన టార్పాలిన్లు
విజయనగరం మండలం రాకోడులో ధాన్యం తడిసిపోకుండా టార్పాలిన్లు కప్పుతున్న రైతులు
షెడ్యూల్ ఇస్తారు..
పంట నూర్పిడి పూర్తయిన వెంటనే రైతు సేవా కేంద్రంలో ఉన్న వ్యవసాయ సహాయకులకు చెబితే పంట కొనుగోలుకు షెడ్యూల్ ఇస్తారు. తేమ శాతాన్ని పరీక్షించి ధాన్యం కొనుగోలు చేస్తారు. ఎక్కడైనా పంట కొనుగోలులో ఇబ్బంది వస్తే సంబంధిత వ్యవసాయ అధికారికి, సీఎస్‌డీటీకి చెబితే చర్యలు తీసుకుంటారు.
– వి.తారకరామారావు,
జేడీ, వ్యవసాయశాఖ
పొలాల్లోనే వరి కుప్పలు,
ధాన్యం రాశులు
ధాన్యం తడిసిపోకుండా
కాపాడుకునేందుకు అష్టకష్టాలు
పడుతున్న రైతులు
టార్పాలిన్లు సరఫరా చేయని ప్రభుత్వం
మందకొడిగా ధాన్యం కొనుగోళ్లు
చివరిలో.. దిత్వా అలజడి
చివరిలో.. దిత్వా అలజడి
చివరిలో.. దిత్వా అలజడి
చివరిలో.. దిత్వా అలజడి
చివరిలో.. దిత్వా అలజడి


