పండగ వాతావరణంలో పీటీఎం నిర్వహణ
● కలెక్టర్ ఎస్.రాంసుందర్‌రెడ్డి
విజయనగరం అర్బన్: ప్రభుత్వ పాఠశాలల్లో ఈ నెల 5వ తేదీన మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ (పీటీఎం)ను పండగ వాతారణంలో నిర్వహించేందుకు విద్యాశాఖ అధికారులు ఏర్పాట్లు చేస్తోందని కలెక్టర్ ఎస్.రాంసుందర్‌రెడ్డి తెలిపారు. తన చాంబర్‌లో పీటీఎం షెడ్యూల్‌ను సోమవారం విడుదల చేశారు. జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ఎయిడెడ్ పాఠశాలలు, ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో మెగా పీటీఎం కార్యక్రమాలను నిర్వహిస్తామని కలెక్టర్ వెల్లడించారు. ఉదయం 9 గంటలకు ప్రారంభమై మధ్యాహ్నం 12.45 గంటలకు పీటీఎం ముగుస్తుందన్నారు. కార్యక్రమంలో డీఈఓ యు.మాణిక్యంనాయుడు, సమగ్రశిక్ష ఏపీసీ డాక్టర్ ఎ.రామారావు పాల్గొన్నారు.
మెట్టపల్లిలో వైద్య శిబిరం
● వైద్య శిబిరాన్ని సందర్శించిన
డీఎంహెచ్‌ఓ
చీపురుపల్లి: స్క్రబ్ టైఫస్ వైరస్ కలకలం నేపథ్యంలో చీపురుపల్లి మండలం మెట్టపల్లి గ్రామంలో సోమవారం వైద్యశిబిరం ఏర్పాటు చేశారు. స్క్రబ్ టైఫస్ వైరస్ లక్షణాలతో భార్య మృతి చెందినట్టు భర్త తెలిపిన వివరాల మేరకు గతనెల 30న ‘సాక్షి’లో ప్రచురితమైన వార్తకు వైద్య సిబ్బంది స్పందించారు. కర్లాం పీహెచ్‌సీ వైద్యాధికారి శ్రీలక్ష్మి, సిబ్బంది వైద్యశిబిరం నిర్వహించారు. గ్రామంలో జ్వరాలతో బాధపడుతున్న వారి నుంచి రక్త నమూనాలు సేకరించారు. డీఎంహెచ్‌ఓ జీవనరాణి వైద్య శిబిరాన్ని సందర్శించి వైద్యాధికారితో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. మృతురాలు చికిత్స పొందిన ఆస్పత్రి వివరాలపై ఆరా తీశారు. ప్రస్తుతం మెట్టపల్లిలో ఎలాంటి స్క్రబ్ టైఫస్ వైరస్ వ్యాప్తిచెందలేదని పీహెచ్‌సీ వైద్యాధికారి శ్రీలక్ష్మి తెలిపారు. డీఎంహెచ్‌ఓ వెంట జిల్లా ఇమ్యూనిటీ అధికారి సత్తిరాజు, జిల్లా సర్వేలైన్స్ అధికారి సత్యనారాయణ ఉన్నారు.
పార్వతీపురం: విపత్తులు, ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు ముందస్తు జాగ్రత్తలు అవసరమని కలెక్టర్ డా.ఎన్.ప్రభాకరరెడ్డి అన్నా రు. కలెక్టర్ కార్యాలయ ప్రాంగణంలో ఏపీ విపత్తుల స్పందన, అగ్నిమాపక సేవల శాఖ జిల్లా కు సరఫరా చేసిన రక్షణ పరికరాలను కలెక్టర్ సోమవారం పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ విపత్తులశాఖ సామర్థ్యా న్ని మరింత పెంపొందించుకోవాలన్నారు. రక్ష ణ పరికరాలతో జిల్లాలోని ప్రజలకు సమయానుకూలంగా, త్వరితగతిన, నాణ్యమైన సేవలు అందించాలని సూచించారు. కార్యక్రమంలో విపత్తుల నిర్వాహణాధికారి పి.సింహాచలం, సిబ్బంది పాల్గొన్నారు.


