గ్యాస్ సరఫరా చేయకుండా.. భోజనం వండేది ఎలా?
గ్యాస్ సరఫరా చేయకుండా పాఠశాలల పిల్లలకు మధ్యాహ్న భోజనం వండేది ఎలా ‘బాబూ’ అంటూ నిర్వాహకులు ఆందోళన వ్యక్తంచేశారు. తమ సమస్యలు పరిష్కారం కోరుతూ ఏపీ మధ్యాహ్నభోజన కార్మిక సంఘం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో విజయనగరం కలెక్టరేట్ వద్ద సోమవారం ధర్నా చేశారు. మెనూ చార్జీలు ఒక్కో విద్యార్థికి రూ.20 చొప్పున చెల్లించాలని, భోజన కార్మికులకు నెలకు రూ.10వేలు జీతం చెల్లించాలని డిమాండ్ చేశారు. చంద్రబాబు ప్రభుత్వం వచ్చాక భోజన బకాయిలు పేరుకుపోతున్నాయంటూ ఆవేదన వ్యక్తంచేశారు.
– సాక్షిఫొటోగ్రాఫర్, విజయనగరం


