నేడు పీజీఆర్‌ఎస్
విజయనగరం అర్బన్: కలెక్టరేట్ సమావేశ మందిరంలో సోమవారం ఉదయం 10 గంటల నుంచి ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని నిర్వహించి ప్రజల నుంచి అర్జీలను స్వీకరించనున్నట్టు ఎస్.రాంసుందర్‌రెడ్డి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రజా సమస్యల పరిష్కార వేదికకు తమ వివరాలతో పాటు వారి సమస్యలకు సంబంధించి అర్జీలను అందజేయాలని చెప్పారు. జిల్లా ప్రజలు పీజీఆర్‌ఎస్ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
విజయనగరం: అండర్ – 12 బాలుర జిల్లా క్రికెట్ జట్టు ఎంపిక పోటీలు మంగళవారం నిర్వహించనున్నట్టు జిల్లా క్రికెట్ అసోసియేషన్ కార్యదర్శి పి.సీతారామరాజు (రాంబాబు) శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లా కేంద్రంలోని బాబా మెట్ట శివారు విజ్జి స్టేడియంలో మంగళవారం ఉదయం 7 గంటలకు ఎంపి క పోటీలు నిర్వహిస్తామని ఆయన పేర్కొన్నా రు. పోటీలకు హాజరయ్యే క్రీడాకారులు 2013 సెప్టెంబర్ 1 తర్వాత జన్మించిన వారై ఉండాల ని తెలిపారు. క్రీడాకారులు తెలుపు దుస్తులు ధరించి రావాలని సూచించారు.
చీపురుపల్లి: మండలంలోని రావివలస రెవె న్యూ పరిధిలో అనుమతుల్లేకుండా ఏర్పాటైన రియల్ ఎస్టేట్ వెంచర్‌ను అధికారులు పరిశీలించారు. రావివలస రెవెన్యూ పరిధిలో అనుమతుల్లేని లే అవుట్‌పై దర్జాగా రియల్ దందా అనే శీర్షికన సాక్షి పత్రికలో ఆదివారం వెలువడిన కథనంపై అధికారులు స్పందించారు. ఎంపీడీ వో ఐ.సురేష్, డిప్యూటీ ఎంపీడీవో అప్పలనాయుడు, పంచాయతీ కార్యదర్శి సతీష్ లేఅవుట్‌ను పరిశీలించారు. లే అవుట్‌కు సంబంధించి ఎలాంటి అనుమతులు ఉన్నా యో, అనుమతులు తీసుకున్నారా.. లేదా.. అ నే అంశాలపై నాలుగు రోజుల్లో వివరణ ఇవ్వా లని లేఅవుట్ యాజమాన్యానికి నోటీసులు అందజేశారు. అనుమతులు లేని లేఅవుట్లలో సోమవారం బోర్డులు ఏర్పాటు చేస్తామని ఎంపీడీవో తెలిపారు. సర్వే నంబర్లలో స్పష్టత కోసం తహసీల్దార్‌కు సమాచారం కోరనున్న ట్టు ఎంపీడీవో చెప్పారు.
నేడు పీజీఆర్‌ఎస్


