రైల్వే ట్రాక్‌పై గుర్తు తెలియని మృతదేహం
విజయనగరం క్రైమ్: విజయనగరం రైల్వే డివిజన్ పరిధి లో కంటకాపల్లి కొత్తవలస రైల్వే స్టేషన్ల మధ్య రైల్వే ట్రా క్‌పై ముప్పై ఏళ్ల వయస్సు కలిగిన వ్యక్తి మృతదేహాన్ని జీఆర్పీ ఆదివారం కనుగొంది. సదరు వ్యక్తి సు మారు 5 అడుగుల 5 అంగుళాల పొడవు, తెలు పు రంగు ఛాయతో ఎరుపు రంగుపై తెలుపు రంగు గీతల గల ఫుల్ హాండ్స్ షర్ట్, నలుపు రంగు జీన్ ఫ్యాంట్ ధరించి ఉన్నాడని జీఆర్పీ హెచ్సీ రవికుమార్ తెలిపారు. మృతుడి ఆచూకీ తెలిసినవారు ఫోన్ 94419 62879, 9490617089 నంబర్‌కు కానీ జీఆర్పీ ల్యాండ్ లైన్ నంబర్ 08912 883218కు కానీ తెలియజేయాలని కోరారు.


