వివరాలు సరిచేసుకోండి
తెర్లాం: జిల్లాలో ఈ ఏడాది ఖరీఫ్ సీజన్‌లో వ్యవసాయశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ–పంట నమోదులో ఎటువంటి అభ్యంతరాలున్నా రైతులు సోమవారంలోగా సరిచేసుకోవాలని జిల్లా వ్యవసాయ అధికారి వి.తారకరామారావు సూచించారు. తెర్లాం సచివాలయంలో ఏఓ బి.శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ఈ–పంట నమోదుపై రైతులకు అవగాహన కల్పించారు. రైతుల పేర్లు, భూముల విస్తీర్ణం, పంట వివరాలు, బ్యాంక్ ఖాతా, ఆధార్ నంబర్లు సరిగ్గా ఉన్నవీ, లేనివి పరిశీలించుకోవాలని తెలిపారు. తప్పులుంటే ఏఓలు, ఏఏఓలను సంప్రదించి సరిచేసుకోవాలని కోరారు. వరి పంటను ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో విక్రయించాలని సూచించారు. ఆయన వెంట తహసీల్దార్ జి.హేమంత్‌కుమార్ ఉన్నారు.


