
అందని వైద్యం... ఆవేదనలో జనం
ఉమ్మడి విజయనగరం జిల్లాలోని పీహెచ్‌సీల సంఖ్య
పీహెచ్‌సీలో పనిచేస్తున్న వైద్యుల సంఖ్య
సుమారు 140 మంది
● రోగులకు అగచాట్లు
సమ్మెలో
ఉన్నది
విజయనగరం ఫోర్ట్:
ఓ వైపు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల(పీహెచ్‌సీ) వైద్యుల సమ్మె... మరోవైపు ఆరోగ్యశ్రీ (ఎన్టీఆర్ వైద్యసేవ) ప్రైవేటు నెట్‌వర్క్ ఆస్పత్రుల యాజమాన్యాలు సేవల నిలిపివేతతో రోగులు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. సకాలంలో మెరుగైన వైద్యసేవలు అందక అవస్థలు పడుతున్నారు. కొందరు ప్రాణాలు విడుస్తున్నారు. పీహెచ్‌సీ వైద్యుల సమ్మెతో పల్లె ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. వైద్యం కోసం గంటల తరబడి నిరీక్షిస్తున్నా ఫలితం ఉండడంలేదు. దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తుల పరిస్థితి ఘోరం. ప్రతినెలా అందే 104 వాహన సేవలు కొన్నిచోట్ల నిలిచిపోవడం, మందులు అందకపోవడంతో అస్వస్థతకు గురవుతున్నారు. పీహెచ్‌సీల్లో ఇన్‌చార్జి వైద్యులను నియమించినా సేవలు అంతంతమాత్రంగానే అందుతున్నాయంటూ రోగులు, వారిబంధువులు ఆరోపిస్తున్నారు. కొన్నిచోట్ల ఫార్మసిస్టులు, నర్సులు వైద్యం చేస్తున్నారు.
● డాక్టర్ లేని వైద్యం
పీహెచ్‌సీ వైద్యుల సమ్మెతో ఫ్యామిలీ డాక్టర్ సేవలు నిలిచిపోయాయి. ఫ్యామిలీ డాక్టర్ కార్యక్రమం ఉదయం 9 నుంచి సాయంత్రం 4 గంటల వరకు ప్రతిరోజు ఒక గ్రామంలో నిర్వహించాలి. ఉదయం వైద్యశిబిరం ఏర్పాటు చేసి అక్కడకు వచ్చే రోగులకు వైద్య పరీక్షలు చేయడంతో పాటు అవసరమైన మందులు అందజేయాలి. మధ్యాహ్నం పాఠశాలలు, అంగన్‌వాడీ కేంద్రాలను సందర్శించి అక్కడ పిల్లలకు పరీక్షించాలి. ఆ తర్వాత పక్షవాతం, ఇతర అనారోగ్యం కారాణాలతో మంచాన పడినవారి ఇంటికి వెళ్లి చికిత్స అందించాలి. వైద్యులు సమ్మెతో ఈ సేవలన్నింటిని ఏఎన్‌ఎం, స్టాఫ్ నర్సు, పారా మెడికల్ సిబ్బందితో కానిచ్చేస్తున్నారు. దీనిపై పల్లెప్రజలు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు.
పడకేసిన పల్లైవెద్యం!
మూడు వారాలుగా సమ్మెలో పీహెచ్‌సీ వైద్యులు
రోగులకు తప్పని తిప్పలు
నిలిచిన 104 సేవలు!
ఆందోళనలో దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు
వైద్యులు లేక..
చిత్రంలో ఖాళీగా కనిపిస్తున్నది బాడంగి పీహెచ్‌సీ. ఇక్కడి ఇద్దరు వైద్యులు సమ్మెలో ఉన్నారు. ఇక్కడకు సీహెచ్‌సీ నుంచి ఒక మహిళా డాక్టర్‌ను డిప్యుటేషన్‌పై వేశారు. ఆమె ఎప్పుడు వస్తారో.. రారో తెలియక రోగులు ఆస్పత్రికి రావడమే మానేశారు. గతంలో రోజుకు 70 ఓపీ నమోదయ్యేది. ఇప్పుడు కొన్నిరోజుల్లో సింగిల్ డిజిట్ ఓపీ నమోదవుతోంది. కుటుంబ సంక్షేమ చికిత్సలు కూడా నిలిచిపోయాయి. వైద్యుల సమ్మెతో 22 గ్రామాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.
– బాడంగి
బొబ్బిలిరూరల్: వైద్యుల సమ్మెతో గ్రామీణ ప్రాంతాల్లోని రోగులకు వైద్య సేవలు అందడంలేదు. పిరిడి పీహెచ్‌సీలో బాడంగి ఆయుర్వేద వైద్యురాలిని, విజయనగరం జీజీహెచ్‌లో ఎంబీబీఎస్ ఇంటర్న్‌షిప్ చేస్తోన్న మరో విద్యార్థినిని నియమించారు. అయితే, మెరుగైన వైద్యసేవలు అందడంలేదని రోగులు వాపోతున్నారు.
– పక్కి పీహెచ్‌సీలో బొబ్బిలి ప్రభుత్వాస్పత్రికి చెందిన ఆయుష్ వైద్యులను నియమించారు. వైద్యసేవలు అందకపోవడంతో ఆస్పత్రికి వచ్చే రోగుల సంఖ్య అమాంతం పడిపోయింది. గతంలో ప్రతిరోజు 80 ఓపీ నమోదుకాగా, ఇప్పుడు 20 ఓపీ నమోదవుతోంది. అత్యవసర వేళ ఆస్పత్రికి వచ్చేవారిని కూడా విజయనగరం ప్రభుత్వాస్పత్రికి రిఫర్ చేస్తున్నారంటూ రోగుల బంధువులు వాపోతున్నారు.
జబ్బు తగ్గుతుందన్న నమ్మకం లేదు
వారం రోజులుగా జ్వరం, కాళ్లు, ఒళ్లునొప్పులతో బాధపడుతున్నాను. ఇక్కడికి కొత్తడాక్టర్లు వచ్చారు. మందులిచ్చారు. అవి వాడుతున్నా జబ్బుతగ్గుతుందన్న నమ్మకం కలగడంలేదు. రేపు బొబ్బిలి ప్రైవేటు ఆస్పత్రికి వెళ్లాలి.
– తూముల చినమల్లమ్మ, రోగి, పిరిడి
అంతంతమాత్రమే..
కొమరాడ: మండలంలోని కొమరాడ, కూనేరు రామభద్రపురం పీహెచ్‌సీల్లో వైద్య సేవలు అంతంత మాత్రమే అందుతున్నాయి. వైద్యకోసం ఆస్పత్రులకు వస్తున్న చిన్నారులకు మెరుగైన వైద్యసేవలు అందడం లేదు. గంటల తరబడి నిరీక్షిస్తున్నారు. పెదఖేర్జిల గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాల విద్యార్థులు పలువురు జ్వరాలతో బాధపడుతూ కొమరాడ పీహెచ్‌సీకి బుధవారం వచ్చారు. సేవలు అంతంతమాత్రంగానే అందాయంటూ విద్యార్థుల తల్లిదండ్రులు వాపోయారు.
వైద్యులను నియమించాం
సమ్మె కారణంగా రోగులకు ఇబ్బంది కలగకుండా ఉండేందుకు ఏపీవీపీ ఆస్పత్రుల నుంచి 20 మంది వైద్యులను, ప్రభుత్వ వైద్య కళాశాల నుంచి 15 మంది వైద్యులను నియమించాం. వారు ఆస్పత్రులకు వెళ్లడం లేదని తెలిస్తే చర్యలు తీసుకుంటాం. ప్రతీ పీహెచ్‌సీ పరిధిలో ఉన్న ఆయుష్ వైద్యులు సైతం సేవలందిస్తున్నారు.
– డాక్టర్ ఎస్.జీవనరాణి , డీఎంహెచ్‌ఓ
ఇదీ పరిస్థితి..
ఉమ్మడి విజయనగరం జిల్లాలో 87 పీహెచ్‌సీలు ఉన్నాయి. వాస్తవంగా పీహెచ్‌సీకి ఇద్దరు వైద్యులు ఉండాలి. విజయనగరంలో 50 పీహెచ్‌సీలకు 100 మంది వైద్యులు ఉండాల్సి ఉండగా 94 మంది ఉన్నారు. వీరిలో 71 మంది వైద్యులు సమ్మెలో ఉన్నారు. పార్వతీపురం మన్యం జిల్లాలో 37 పీహెచ్‌సీలు ఉండగా వీటిలో సుమారు 67 మంది వైద్యులు పని చేస్తున్నారు. పీజీ సీట్లలో రిజర్వేషన్, వివిధ సమస్యల పరిష్కారం కోరుతూ గత నెల 26 నుంచి వైద్యులు వివిధ రూపాల్లో నిరసన తెలుపుతున్నారు. ప్రభుత్వం దిగిరాకపోవడంతో గత నెలాఖరు నుంచి ఓపీ, అత్యవసర సేవలను సైతం నిలిపివేసి.. సమ్మెలోకి వెళ్లిపోయారు. పీహెచ్‌సీల్లో సేవలు నిలిచిపోకుండా వైద్యశాఖాధికారులు విజయనగరం, పార్వతీపురం జిల్లా ఆసుపత్రులు, వైద్య కళాశాల, మిమ్స్, ఆయుష్, ఇతర విభాగాల నుంచి డిప్యుటేషన్‌పై పంపించినా వీరిలో చాలామంది వేర్వేరు స్పెషలిస్టులు కావడంతో మొక్కుబడిగా ఇలా వచ్చి, అలా చూసి వెళ్లిపోతున్నారు. ఫలితంగా రోగులకు సరైన చికిత్స అందడం లేదు.
87
161

అందని వైద్యం... ఆవేదనలో జనం

అందని వైద్యం... ఆవేదనలో జనం

అందని వైద్యం... ఆవేదనలో జనం

అందని వైద్యం... ఆవేదనలో జనం

అందని వైద్యం... ఆవేదనలో జనం

అందని వైద్యం... ఆవేదనలో జనం

అందని వైద్యం... ఆవేదనలో జనం

అందని వైద్యం... ఆవేదనలో జనం