కౌశల్‌–2025 జిల్లా కో ఆర్డినేటర్‌గా బంగారయ్య | - | Sakshi
Sakshi News home page

కౌశల్‌–2025 జిల్లా కో ఆర్డినేటర్‌గా బంగారయ్య

Oct 23 2025 9:26 AM | Updated on Oct 23 2025 9:26 AM

కౌశల్

కౌశల్‌–2025 జిల్లా కో ఆర్డినేటర్‌గా బంగారయ్య

విజయనగరం అర్బన్‌: జిల్లాలో పీజీఆర్‌ఎస్‌లో అందిన వినతుల పరిష్కారానికి ప్రాధాన్యమివ్వాలని కలెక్టర్‌ ఎస్‌.రాంసుందర్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. జిల్లా, డివిజన్‌, మండల స్థాయి అధికారులతో బుధవారం నిర్వహించిన టెలికాన్ఫరెన్స్‌లో ఆయన మాట్లాడారు. ప్రజా ఫిర్యాదుల పరిష్కారంలో పారదర్శకత, వేగం, బాధ్యత ప్రధానమన్నారు. ప్రజల సమస్యలు సమయానికి పరిష్కరించడం ప్రభుత్వ బాధ్యత అన్న భావన ప్రతి అధికారిలో ఉండాలన్నారు. సరిగా పరిష్కరించని ఫిర్యాదులు 8 శాతానికి మించకూడదన్నారు. ఆడిట్‌ పెండింగ్‌ 20 శాతం లోపు ఉండాలన్నారు.

నెల్లిమర్ల: సైన్స్‌ ప్రతిభ పరీక్ష కౌశల్‌–2025 జిల్లా కోఆర్డినేటర్‌గా శివుకు బంగారయ్య నియమితులయ్యారు. ఆయన నెల్లిమర్ల నగర పంచాయతీ జరజాపుపేట ఉన్నత పాఠశాలలో సైన్స్‌ ఉపాధ్యాయునిగా విధులు నిర్వహిస్తున్నారు. నవంబర్‌ 1 నుంచి 4వ తేదీ వరకు పాఠశాల స్థాయి పోటీలు, 27, 28 తేదీల్లో జిల్లాస్థాయి పోటీలు జరుగుతాయని బంగారయ్య తెలిపారు. 8, 9, 10 తరగతుల విద్యార్థులు పోటీల్లో పాల్గొనవచ్చన్నారు.

గ్రంథాలయాలకు

రూ.4 కోట్ల బకాయిలు

రామభద్రపురం: జిల్లాలో గ్రంథాలయ శాఖకు స్థానిక సంస్థలు దాదాపు రూ.4 కోట్ల పన్ను బకాయిలు చెల్లించాల్సి ఉందని ఏపీ గ్రంథాలయ పరిషత్‌ మెంబర్‌ రౌతు రామ్మూర్తినాయుడు అన్నారు. మండల కేంద్రంలోని శాఖా గ్రంథాలయాన్ని బుధవారం ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలోని శాఖా గ్రంఽథాలయాలు 41 ఉన్నాయని, వాటిలో పలు సమస్యలు గుర్తించామ న్నారు. జిల్లాలోని గ్రంథాలయాల్లో పనిచేస్తున్న 14 మంది అవుట్‌సోర్సింగ్‌ ఉద్యోగులను రెగ్యులర్‌ చేయడంతో పాటు జీఓ నంబర్‌ 010 ప్రకారం జీతాలు చెల్లించాలని ప్రభుత్వాన్ని కోరారు. ఆయన వెంట జిల్లా శాఖా గ్రంథాలయ కార్యదర్శి బి.లక్ష్మి, లైబ్రేరియన్‌ బి సత్యవాణి ఉన్నారు.

సహకార సంస్థలు డేటాను అందించాలి

విజయనగరం అర్బన్‌: నేషనల్‌ కోపరేటివ్‌ డేటా బేస్‌ పోర్టల్‌లో అప్‌లోడ్‌ చేసేందుకు సహకార సంస్థలు వారి డేటాను జిల్లా సహకార అధికారికి సమర్పించాలని కలెక్టర్‌ ఎస్‌.రాంసుందర్‌రెడ్డి ఆదేశించారు. కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో బుధవారం నిర్వహించిన జిల్లా కోపరేటివ్‌ డెవలప్‌మెంట్‌ కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. కోపరేటివ్‌ ద్వారా జిల్లాలో 19,500 మెట్రిక్‌ టన్నుల సామర్థ్యం కలిగిన గొడౌన్‌ స్పేస్‌ అందుబాటులో ఉందని, మార్కెటింగ్‌ ఏడీతో మాట్లాడుకుని ఈ స్పేస్‌ను వినియోగంలోకి వచ్చేలా చూడాలని డీసీఓ రమేష్‌కు సూచించారు. సమావేశంలో జేసీ సేతుమాధవన్‌, వ్యవసాయ, మత్స్య, పశు సంవర్థక, చేనేత, అబ్కారీ శాఖల జిల్లా అఽధికారులు పాల్గొన్నారు.

పార్సిల్‌ పేలుడు ఘటనలో నలుగురికి రిమాండ్‌

పార్వతీపురం రూరల్‌: ఆర్టీసీ కాంప్లెక్స్‌లో గోడబాంబుల పేలుడు ఘటనలో వాటి తయారీ, రవాణాకు పాల్పడిన నలుగురు నిందితులను కోర్టు ఆదేశాల మేరకు బుధవారం రిమాండ్‌కు తరలించినట్టు పార్వతీపురం పట్టణ పోలీస్‌ స్టేషన్‌ ఎస్‌ఐ గోవింద తెలిపారు. వీరిలో మెంటాడ మండలం ఇద్దనవలసకు చెందిన దాసరి పెంటయ్య (తయారీదారు), ముప్పిడి కాశీరాజు, అల్లాడ రవీంద్ర (రవాణాదారు), కొత్త కోట కిశోర్‌ (కొనుగోలుదారు) ఉన్నారన్నారు.

పీజీఆర్‌ఎస్‌ వినతుల

పరిష్కారానికి ప్రాధాన్యం

కౌశల్‌–2025 జిల్లా  కో ఆర్డినేటర్‌గా బంగారయ్య 1
1/2

కౌశల్‌–2025 జిల్లా కో ఆర్డినేటర్‌గా బంగారయ్య

కౌశల్‌–2025 జిల్లా  కో ఆర్డినేటర్‌గా బంగారయ్య 2
2/2

కౌశల్‌–2025 జిల్లా కో ఆర్డినేటర్‌గా బంగారయ్య

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement