
● నాడి పట్టే నాథుడేడి?
పాలకొండ రూరల్/గుమ్మలక్ష్మీపురం: ప్రాథమిక వైద్య ఆరోగ్య కేంద్రాల్లో నాడి పట్టే నాథుడు కరువయ్యాడు. కూటమి సర్కారు తీరుతో పల్లె ప్రజలు గడచిన మూడు వారాలుగా వైద్యంకోసం ఇబ్బందులు పడుతున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
● పాలకొండ నియోజకవర్గంలో ఒడిశా సరిహద్దు ప్రాంతమైన భామిని మండల కేంద్రంలోని పీహెచ్‌సీలో ఉదయం 10 గంటలైనా వైద్యులు హాజరు కాలేదు. దీంతో ఆరోగ్య సమస్యలతో వచ్చిన రోగులు వేచి చూడాల్సిన పరిస్థితి నెలకొంది. గర్భిణులు, బాలింతలతో పాటు వృద్ధులకు సాధారణ వైద్య సేవలు అందలేదు.
● పాలకొండ మండల పరిధిలో అన్నవరం, ఎం.సింగుపురం పీహెచ్‌సీలకు స్థానిక ఏరియా ఆస్పత్రి నుంచి వైద్యులను కేటాయించారు. సమయానికి రాకపోవడంతో రోగులకు నిరీక్షణ తప్పలేదు.
● గుమ్మలక్ష్మీపురం మండలంలోని రేగిడి, దుడ్డుఖల్లు, తాడికొండ గ్రామాల్లోని పీహెచ్‌సీల్లో కూడా వైద్యసేవలు సకాలంలో అందక పలువురు రోగులు వెనుదిరిగారు. కొందరు ప్రైవేటు ఆస్పత్రులను ఆశ్రయించారు.

● నాడి పట్టే నాథుడేడి?