
రోడ్డు ప్రమాదంలో జూనియర్ అసిస్టెంట్ మృతి
● అటెండర్‌కు గాయాలు
● రెండు బైక్‌లు ఢీకొనడంతో ప్రమాదం
తెర్లాం: మండలంలోని చుక్కవలస గ్రామం వద్ద బుధవారం ఉదయం ఎదురెదురుగా వస్తున్న రెండు మోటారు సైకిళ్లు ఢీకొన్న ప్రమాదంలో నెమలాం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జూనియర్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న కె.శ్రావణ్‌కుమార్(33)మృతి చెందారు. ఈ ప్రమాదంలో అదే పాఠశాలలో అటెండర్‌గా పనిచేస్తున్న రమణమ్మకు గాయాలయ్యాయి. దీనికి సంబంధించి తెర్లాం ఎస్సై సాగర్‌బాబు తెలిపిన ప్రకారం వివరాలి లా ఉన్నాయి. రాజాం నుంచి నెమలాం వైపు, బూరిపేట నుంచి రాజాం వైపు వస్తున్న రెండు మోటారు సైకిళ్లు చుక్కవలస మలుపు వద్ద బలంగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో శ్రావణ్‌కుమార్ అక్కడికక్కడే మృతి చెందగా, మోటార్ సైకిల్ వెనుక కూర్చున్న మహిళ గాయపడింది. గాయపడిన మహిళను రాజాంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. ప్రాణం ఉందేమో అన్న అనుమానంతో శ్రావణ్‌కుమార్‌ను పెరుమాళి పీహెచ్‌సీకి తీసుకువచ్చారు. అక్కడి సిబ్బంది చూసిన వెంటనే మృతి చెందినట్లు నిర్ధారించారు. ప్రమాదం జరిగిన విషయం తెలుసుకున్న ఎస్‌ఐ సాగర్‌బాబు సిబ్బందితో సంఘటనా స్థలానికి వెళ్లి పరిస్థితిని సమీక్షించారు.
భోరున విలపించిన భార్య, కుటుంబసభ్యులు
పాఠశాలకు వెళ్లి వస్తానని చెప్పి మోటార్ సైకిల్‌పై వెళ్లిన భర్త రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడన్న విషయం తెలిసిన వెంటనే శ్రావణ్‌కుమార్ భార్య నారాయణమ్మ పెరుమాళి పీహెచ్‌సీ వద్దకు వచ్చి భర్త మృతదేహాన్ని చూసి భోరున విలపించింది. కుటుంబసభ్యులు ఆస్పత్రికి వచ్చి మృతదేహాన్ని చూసి కన్నీరుమున్నీరయ్యారు. మృతుడికి ఎనిమిదేళ్ల కుమారుడు సాయి శ్రావణ్ ఉన్నాడు.
ఆస్పత్రికి చేరుకున్న ఎంఈఓ, ఉపాధ్యాయులు
నెమలాం హైస్కూల్‌లో జూనియర్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న శ్రావణ్‌కుమార్ రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడన్న విషయం తెలుసుకున్న ఎంఈఓ త్రినాథరావు, నెమలాం హైస్కూల్ హెచ్‌ఎం సంగమేశ్వరరావు, యూటీఎఫ్ అధ్యక్షుడు మునిస్వామి, పలువురు ఉపాధ్యాయులు పెరుమాళి పీహెచ్‌సీకి వచ్చి శ్రావణ్‌కుమార్ భార్య, కుమారుడిని, కుటుంబ సభ్యులను ఓద్చారు. ఈ సంఘటనకు సంబంధించి మృతుడి భార్య ఫిర్యాదు మేరకు ఎస్సై సాగర్‌బాబు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కుటుంబసభ్యుల సమక్షంలో శవ పంచనామా చేసి పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని బాడంగి సీహెచ్‌సీకి తరలించారు.

రోడ్డు ప్రమాదంలో జూనియర్ అసిస్టెంట్ మృతి

రోడ్డు ప్రమాదంలో జూనియర్ అసిస్టెంట్ మృతి