
క్రికెట్ బెట్టింగ్ ముఠా అరెస్ట్
విశాఖ సిటీ : భారీగా లాభాలు వస్తాయని ఆశ చూపించి ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ ద్వారా క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్న నలుగురిని సైబర్ క్రైమ్ పోలీసులు బుధవారం అరెస్ట్ చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. క్రికెట్ బెట్టింగ్ విషయంలో పోలీసులు ఇప్పటికే అనేక మందిని అరెస్టు చేశారు. తాజాగా ఈ కేసులో మరికొంత మంది పాత్ర ఉన్నట్లు నిర్ధారణకు వచ్చారు. సాంకేతికత సహాయంతో దర్యాప్తు చేపట్టారు. ఎక్స్చేంజ్ 666 అనే అక్రమ ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్ ద్వారా క్రికెట్ బెట్టింగ్ కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్లు గుర్తించారు. ఆ వెబ్‌సైట్ ద్వారా డబ్బు పెడితే అధిక లాభాలు వస్తాయని అమాయకులకు ఆశ చూపించి వారి జీవితాలను నాశనం చేస్తున్నట్లు నిర్ధారణకు వచ్చారు. నిరంతరం బెట్టింగ్ ఆడడంతో పాటు ఇతరులకు కూడా ఈ బెట్టింగ్ విధానాన్ని వివరిస్తూ, తమ సొంత ఐడీ ద్వారా అనేక మందిని బెట్టింగ్‌లో పాల్గొనేలా చేస్తున్న నలుగురి ముఠాను గుర్తించారు. రాంబిల్లి మండలం లోవపాలెంకు చెందిన గనగళ్ల బంగార్రాజు(31) అచ్యుతాపురం మండలం దొప్పర్ల గ్రామానికి చెందిన కొరుప్రోలు పూర్ణ కిశోర్(29), పరవాడ మండలం ఫార్మా సిటీకి చెందిన మేడిశెట్టి రాజు(38), విజయనగరం జిల్లా దత్తిరాజేరు మండలం భూపాలరాజపురానికి చెందిన గడిదేశి ఈశ్వరరావు(39)లను అరెస్టు చేశారు. వారిని కోర్టులో ప్రవేశపెట్టగా న్యాయమూర్తి రిమాండ్ విధించారు. వీరి ద్వారా బెట్టింగ్ నిర్వహిస్తున్న బుకీల సమాచారాన్ని తెలుసుకున్నారు. వారిపై నిఘా పెట్టారు.
రిమాండ్‌కు తరలింపు

క్రికెట్ బెట్టింగ్ ముఠా అరెస్ట్

క్రికెట్ బెట్టింగ్ ముఠా అరెస్ట్

క్రికెట్ బెట్టింగ్ ముఠా అరెస్ట్