
దీపావళి ప్రజల జీవితాల్లో వెలుగులు నింపాలి
విజయనగరం రూరల్: దీపావళి పండగ ప్రజలందరి జీవితాల్లో వెలుగు లు నింపాలని జెడ్పీ చైర్మన్, వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షు లు మజ్జి శ్రీనివాసరావు(చిన్న శ్రీను) ఆకాంక్షించారు. ఉమ్మడి జిల్లా ప్రజలకు, ప్రజాప్రతినిధులకు, అధికారులకు, నాయకులకు, కార్యకర్తలకు ఆదివారం ఒక ప్రకటన ద్వారా దీపావళి పండగ శుభాకాంక్షలు తెలిపారు. అమావాస్య నాటి కారు చీకటిని తొలగించడానికి, దీపాలతో వెలుగును నింపడం ఈ పండగ సంప్రదాయమని, మనలోని అంథకారాన్ని తొలగించి జ్ఞాన జ్యోతులు వెలిగించాలన్నది దీని వెనుక ఉద్దేశమని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరి జీవితాల్లో సుఖః సంతోషాలు వెల్లివిరియాలని, ఆ లక్ష్మీదేవి చల్లని చూపుతో అష్టైశ్వర్యాలు సిద్ధించాలని ఆకాంక్షించారు. దీపావళి చీకటిపై వెలుగు, అజ్ఞానంపై జ్ఞానం, చెడుపై మంచి విజయం సాధించిన పండగని పేర్కొన్నారు. ఈ పవిత్ర పండగ సందర్భంగా ప్రతి ఇంటా ఆనందం, ఐశ్వర్యం, శాంతి, సౌభాగ్యం నిండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామని తెలిపారు. ప్రజలు దీపావళి పండగను ఆనందంగా, పర్యావరణ హితంగా జరుపుకోవాలని, ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా తగు జాగ్రత్తలు పాటించాలని విజ్ఞప్తి చేశారు.
డెంకాడ: మండలంలోని అక్కివరం పంచాయ తీ గొల్లపేట వద్ద ఉన్న ఏపీ మోడల్ స్కూల్‌లో పదవ తరగతి చదువుతున్న పతివాడ భాను రాష్ట్ర స్థాయి సైస్స్ సెమినార్–2025లో విజేత గా నిలిచాడు. విజయవాడలో ఇటీవల జరిగిన సైన్స్ సెమినార్‌లో రాష్ట్ర వ్యాప్తంగా 52 మంది విద్యార్థులు పాల్గొనగా పతివాడ భాను విజేతగా నిలిచాడు. ఈ నెల 29వ తేదీన బెంగళూరులో జరగనున్న జాతీయ స్థాయి సైన్స్ సెమినార్‌కు భాను ఒక్కడే ఎంపికయ్యాడని ప్రిన్సిపాల్ సీహెచ్ సంధ్య ఆదివారం తెలిపారు. విజేతగా నిలిచిన పతివాడ భాను ఎస్‌సీఈఆర్‌టీ డైరెక్టర్ ఎం.వెంకటకృష్ణరెడ్డి చేతుల మీదుగా ప్రశంసా పత్రాన్ని అందుకున్నారు. గైడ్ టీచర్‌గా వై.రెబెక్క సెల్వి వ్యవహరించారు. విజేతగా నిలిచిన పతివాడ భానును డీఈవో యు.మాణిక్యంనాయుడు, ప్రిన్సిపాల్ సంధ్య, ఉపాధ్యాయులు అభినందించారు. జాతీయ స్థాయిలో రాణించి జిల్లా, రాష్ట్ర గౌరవాన్ని నిలబెట్టాలని ఆకాంక్షించారు.