
నిర్ణీత గడువు పెట్టి..
సుప్రీంకోర్టు సెప్టెంబర్ 1న ప్రభుత్వ ఉపాధ్యాయులు టెట్ అర్హత సాధించాలని తీర్పు ఇచ్చింది. వెంటనే చాలా రాష్ట్రాలు రివ్యూ పిటిషన్లు వేశాయి. ఇక్కడ ఇంతవరకూ కదలిక లే దు. ఇలాగైతే చాలా మంది ఉపాధ్యాయులకు ఇబ్బందులు తప్పవు. కొత్తగా వస్తున్న నిబంధ నలను గత ఉద్యోగులకు, ఉద్యోగాలకు ముడిపెట్టడం సబబుకాదు. ఏ ప్రభుత్వ శాఖకు లేని నిబంధనలు విద్యా శాఖకు మాత్రమే అమలు చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ విషయంపై ఉపాధ్యాయులకు అనుకూలంగా వ్యవహరించాలి. – అదపాక దామోదరరావు,
సీనియర్ ఉపాధ్యాయులు, రాజాం