
విజయనగరం
న్యూస్‌రీల్
ప్రభుత్వ ఉపాధ్యాయులకు టెట్ అర్హత తప్పనిసరి సుప్రీం ఆదేశాలతో మల్లగుల్లాలు పడుతున్న ఉపాధ్యాయులు ఇదివరకే టెట్ క్వాలిఫైతో పోస్టుల్లో చేరిన వారికి ఉపశమనం 55 ఏళ్లు దాటిన ఉపాధ్యాయులకు మినహాయింపు మిగిలిన వారికి తప్పని పరీక్ష వ్యతిరేకిస్తున్న ఉపాధ్యాయ సంఘాలు
సోమవారం శ్రీ 20 శ్రీ అక్టోబర్ శ్రీ 2025
గురువులకు గడ్డు పరీక్ష!
రాజాం:
కొండనాలికకు మందు వేస్తే ఉన్న నాలిక ఊడిపోయినట్టుగా మారింది ప్రభుత్వ ఉపాధ్యాయుల పరిస్థితి. కూటమిపై అత్యాశతో సార్వత్రిక ఎన్నికల ముందు పెద్ద ఎత్తున కొంతమంది ప్రభుత్వ ఉపాధ్యాయులు గెలుపునకు కృషి చేశారు. పెత్త ఎత్తున కూటమికి ప్రభుత్వ ఉపాధ్యాయుల ఓట్లు పడ్డాయి. పాత ఫించన్ విధానం ఇస్తారనే నమ్మకంతో గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వం అమలు ప్రారంభించిన గ్యారంటీ ఫించన్ స్కీంను తోసిపుచ్చారు. అధికారంలోకి వచ్చిన కూటమి కొత్తగా ఇంక్రిమెంట్లు, టీఏ లు, డీఏలు ఏమీ ఇవ్వడం లేదు. వీటిని పక్కన పెడి తే ఉపాధ్యాయుల పదోన్నతులు అటకెక్కాయి. మూడు కిలోమీటర్లలోపు రెండు పాఠశాలలు వద్దంటూ, 5వ తరగతి వరకూ ఉన్న ఎలిమెంటరీ స్కూల్ విధానాన్ని 2వ తరగతి వరకూ కుదించి, 3 నుంచి 5 వ తరగతులను హైస్కూల్‌లో విలీనం చేసింది. ఉపాధ్యాయ పోస్టులను కుదించేసింది. ఇవి చాలదన్నట్టు ఇప్పుడు ప్రభుత్వ ఉపాధ్యాయులకు టెట్ పరీక్ష ఉత్తీర్ణత తప్పనిసరి అన్నట్టుగా వ్యవహరిస్తోంది. రాష్ట్రంలో 54 ప్రభుత్వ శాఖలు ఉండగా, ఒక్క ఉపాధ్యాయ పోస్టులకు ఈ కొర్రీలు పెట్టడం కక్ష సాధింపుగా ఉపాధ్యాయులు పరిగణిస్తున్నారు.
సుప్రీం తీర్పుతో..
వచ్చే ఏడాది జనవరిలో డీఎస్సీ నోటిఫికేషన్ ఇస్తా మని ప్రభుత్వం ప్రకటించింది. ఈ నేపథ్యంలో ముందుగానే టెట్ పరీక్ష నిర్వహణకు సన్నద్ధమౌతుంది. ఈ పరీక్షను ప్రస్తుతం సర్వీసులో ఉన్న ఉపాధ్యాయులు కూడా రాయాలని సూచిస్తుంది. ప్రభు త్వ ఉపాధ్యాయులు అంతా రెండేళ్లలోపే టెట్ పరీక్ష పాసవ్వాలని సుప్రీంకోర్టు ఇటీవల తీర్పు ఇచ్చింది. దీంతో ఈ తీర్పును అమలుపరిచే దిశగా రాష్ట్ర ప్రభుత్వం పావులు కదుపుతుండడంతో ప్రభుత్వ ఉపాధ్యాయులకు మింగుడు పడడంలేదు.
9 వేల మందికి పైగా..
జిల్లాలో ప్రస్తుతం 9 వేల మందికి పైగా ప్రభుత్వ ఉపాధ్యాయులు ఉన్నారు. 2010 ఏడాది తర్వాత డీఎస్సీ రాసిన వారంతా టెట్ అర్హత సాధించి ఉన్నా రు. అంతకు ముందు ఉన్న ఉపాధ్యా

విజయనగరం