
ఇది సరైన విధానం కాదు..
పాత నిబంధనలను కొత్త వాటితో పోల్చడం, ఉపాధ్యాయులకు ఇబ్బంది పెట్ట డం సరైన విధానం కాదు. వీటిపై మేధావి వర్గాలు ఆలోచన చేయాలి. గతంలో ఉపాధ్యాయ వృత్తి అంటే చాలా కష్టంతో కూడుకున్నది. ఉపాధ్యా య శిక్షణకు ముందుగానే ఒక పరీక్ష పాసవ్వాలి. ర్యాంకు రావాలి. అనంతరం డీఎస్సీలో ర్యాంకు రావాలి. అప్పట్లో శిక్షణ అంటేనే సివిల్స్ మాదిరి గా ఉండేది. అటువంగి సమయంలో ఉపాధ్యా య ఉద్యోగాలు పొందినవారు చాలా కష్టపడిన వారే. వారికి ఇప్పుడు మళ్లీ టెట్‌తో ముడిపెట్ట డం సరైన విధానం కాదు.
– పొట్నూరు మొయ్యన్నాయుడు, రిటైర్డ్
హెచ్‌ఎం, చింతలపేట, సంతకవిటి మండలం