
ఆర్పీఎఫ్ కానిస్టేబుల్‌కు అవార్డు
● గుజరాత్‌లో మంత్రి చేతుల మీదుగా అందుకున్న సుమతి
వంగర: మండల పరిధి తలగాం గ్రామానికి చెందిన ఆర్‌పీఎఫ్ కానిస్టేబుల్ కిమిడి సుమతికి ధైర్య సాహస అవార్డు దక్కింది. ఐదేళ్ల కిందట రైల్వే ప్రొటెక్షన్ ఫోర్సులో కానిస్టేబుల్‌గా వెస్ట్ బెంగాల్‌లోని మెచేడా రైల్వేస్టేషన్‌లో విధులు నిర్వహించే సమయంలో.. ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడుతుండగా ఆ వ్యక్తిని రక్షించింది. అలాగే రైల్వే ఆస్తులు, ప్రయాణికుల భద్రత పట్ల ఆమె చూపించిన ధైర్యసాహసాలను సంబంధిత శాఖ గుర్తించింది. ఈ మేరకు గుజరాత్‌లోని వలా్‌స్ద్ ఆర్పీఎఫ్ శిక్షణ కేంద్రంలో రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ చేతులమీదుగా సుమతి సోమవారం అవార్డు అందుకుంది. ఈ మేరకు సుమతిని పలువురు అభినందించారు.