సత్వరమే పరిష్కరించాలి.. | - | Sakshi
Sakshi News home page

సత్వరమే పరిష్కరించాలి..

Oct 14 2025 6:45 AM | Updated on Oct 14 2025 6:45 AM

సత్వరమే పరిష్కరించాలి..

సత్వరమే పరిష్కరించాలి..

కలెక్టర్‌ డాక్టర్‌ ఎన్‌. ప్రభాకరరెడ్డి

పార్వతీపురం రూరల్‌: ప్రజా సమస్యల పరిష్కార వేదిక ద్వారా అందిన సమస్యలను సత్వరమే పరిష్కారమయ్యేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ డాక్టర్‌ ఎన్‌. ప్రభాకరరెడ్డి జిల్లా అధికారులకు దిశానిర్ధేశం చేశారు. పీజీఆర్‌ఎస్‌కు వచ్చిన అర్జీదారులు తమ సమస్యలు పరిష్కారమవుతాయనే నమ్మకంతో తిరిగి వెళ్లాలన్నారు. సోమవారం నిర్వహించిన పీజీఆర్‌ఎస్‌లో 112 మంది అర్జీదారుల నుంచి వినతులు స్వీకరించారు. సంక్షేమ పథకాలు, రెవెన్యూ, పౌరసరఫరాల సేవలు, గృహాల మంజూరు, పింఛన్లు, సర్వే, ఉపాధి, తదితర సమస్యలకు సంబంధించిన వినతులు ఎక్కువగా వచ్చాయి. కార్యక్రమంలో సబ్‌ కలెక్టర్లు ఆర్‌. వైశాలి, పవర్‌ స్విప్నిల్‌ జగన్నాథ్‌, డీఆర్‌ఓ హేమలత, ఉప కలెక్టర్లు ధర్మచంద్రారెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement