
స్కూల్‌గేమ్స్ జిల్లా జట్ల ఎంపికలకు స్పందన
విజయనగరం: పాఠశాల స్థాయిలో విద్యార్ధుల్లో దాగి ఉన్న క్రీడాప్రతిభను వెలికి తీసేందుకు ప్రతి ఏడాది విద్యాశాఖ ఆధ్వర్యంలో నిర్వహించే స్కూల్ గేమ్స్ క్రీడాకారుల ఎంపిక పోటీలు ఉమ్మడి విజయనగరం జిల్లాలో ఉల్లాసంగా.. ఉత్సాహంగా సాగుతున్నాయి. జిల్లా స్కూల్‌గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఎంపికల్లో ఆయా క్రీడాంశాల్లో ఆసక్తి ఉన్న క్రీడాకారులు అధిక సంఖ్యలో పాల్గొంటున్నారు. ఇందులో భాగంగా మంగళవారం విజయనగరం శివారులో గల విజ్జి స్టేడియంలో అండర్–14,17 వయస్సుల విభాగాల్లో బాల, బాలికలకు నిర్వహించిన తైక్వాండో పోటీల్లో 230 మంది క్రీడాకారులు పాల్గొనగా, సైక్లింగ్ పోటీల్లో 80 మంది క్రీడాకారులు పోటీపడ్డారు. అదేవిధంగా స్కేటింగ్ క్రీడాంశంలో అండర్–11,14,17 వయస్సుల విభాగాల్లో నిర్వహించిన ఎంపికలకు 100మందికి పైగా క్రీడాకారులు పాల్గొన్నారు. జిల్లాస్థాయి ఎంపిక పోటీల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన క్రీడాకారులను త్వరలో రాష్ట్రస్థాయిలో జరగనున్న పోటీలకు ఎంపిక చేయనున్నట్లు జిల్లా స్కూల్‌గేమ్స్ ఫెడరేషన్ కార్యదర్శులు కె.గోపాల్, ఎస్.విజయలక్ష్మిలు తెలిపారు. ఎంపిక పోటీలను ఆయా క్రీడా సంఘాల ప్రతినిధులు, కోచ్‌లు, పలువురు వ్యాయామ ఉపాధ్యాయులు పర్యవేక్షించారు.

స్కూల్‌గేమ్స్ జిల్లా జట్ల ఎంపికలకు స్పందన

స్కూల్‌గేమ్స్ జిల్లా జట్ల ఎంపికలకు స్పందన