
జాతీయ బాడీబిల్డింగ్ పోటీలకు ఎంపిక
విజయనగరం: జాతీయస్థాయిలో జరగనున్న బాడీ బిల్డింగ్‌పోటీలకు జిల్లాలోని చీపురుపల్లి పట్టణానికి చెందిన రెడ్డి లక్ష్మునాయుడు అర్హత సాధించాడు. ఇటీవల విశాఖలో జరిగిన రాష్ట్ర స్థాయి పోటీల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన లక్ష్మునాయుడు జాతీయ పోటీలకు ఎంపికై నట్లు జిల్లా బాడీ బిల్డింగ్ అసోసియేషన్ అధ్యక్షుడు రెడ్డి శంకరరావు, కార్యదర్శి కోరాడ శ్రీనివాసరావులు తెలిపారు. డిసెంబర్14,15 తేదీల్లో చండీగఢ్‌లో జరగనున్న పోటీల్లో ఆంధ్రప్రదేశ్ తరఫున లక్ష్మునాయుడు ప్రాతినిధ్యం వహిస్తాడన్నారు. రాష్ట్ర స్థాయి పోటీల్లో ప్రతిభ కనబరచడంతో పాటు జాతీయ పోటీలకు అర్హత సాధించిన లక్ష్మునాయుడిని అసోసియేషన్ ప్రతినిధులు అభినందించారు.