
మారథాన్‌కు సిద్ధం
స్కూల్ ఇన్నోవేషన్
● సన్నద్ధమవుతున్న 6 నుంచి
10 తరగతుల విద్యార్థులు
రూ.లక్ష నుంచి సహకారం..
● దేశవ్యాప్తంగా వచ్చిన పరిష్కారాలలో అత్యంత ప్రతిభ కలిగి ఎంపికై న తొలి 200 ప్రాజెక్ట్‌లకు మినిస్ట్రీ అఫ్ ఎడ్యుకేషన్ వారు ప్రోటోటైప్ చేయడానికి కావాల్సిన ఆర్థిక సహకారం రూ.లక్ష నుంచి రూ.2 లక్షల వరకు అందిస్తారు.
● టాప్ 200 టీమ్స్‌కు ప్రోటోటైప్ చేయడానికి కావాల్సిన సాంకేతిక సహకారాన్ని నేషనల్ ఇన్నోవేషన్ ఫౌండేషన్ సమకూరుస్తుంది.
ఆలోచనలకు పెద్దపీట
విద్యార్థుల ఆలోచనలకు మారథాన్ పెద్దపీట వేస్తోంది. గత ఏడాది జాతీయ స్థాయిలో మన విద్యార్ధులు రూపొందించిన 5 ప్రాజెక్టులు గుర్తింపు పొందాయి. అదే స్ఫూర్తితో ఈ ఏడాది మరిన్ని ఫలితాలు సాధించాలి. తొలి 200 ప్రాజెర్టుల్లో స్థానం పొందేలా ఉపాధ్యాయులు విద్యార్థులను ప్రోత్సహించాల్సి ఉంటుంది. అప్పుడే సంబంధిత అర్థిక సాయం పొందవచ్చు. జిల్లా నుంచి అత్యధిక ఐడియాలను సిద్ధంచేసి సబ్‌మిట్ చేయాలి. ప్రతి పాఠశాల నుంచి పది టీమ్‌లను సైన్స్, గణిత ఉపాధ్యాయులు సిద్ధం చేయాల్సి ఉంటుంది.
– బి.రాజ్‌కుమార్, జిల్లా విద్యాశాఖాధికారి, పార్వతీపురం మన్యం
పాలకొండ రూరల్: విద్యార్థుల్లో అంతర్గతంగా దాగి ఉన్న సజనాత్మకను వెలికి తీసి వారి ఆలోచనలకు పదునుపెట్టే వేదిక స్కూల్ ఇన్నోవేషన్ మారథాన్. భారత దేశంలో విద్యార్థులకు సంబంఽధించి అతిపెద్ద చాలెంజ్ కార్యక్రమం (స్కూల్ ఇన్నోవేషన్ మారథాన్) అని జిల్లా విద్యాశాఖ చెబుతోంది. దీనిని మినిస్ట్రీ అఫ్ ఎడ్యుకేషన్, నేషనల్ ఇన్నోవేషన్ ఫౌండేషన్, నీతి అయోగ్ సంయుక్తంగా నిర్వహిస్తున్నాయి. ఈ వేదికపై తలపడేందుకు జిల్లా పరిధిలో 6–10 తరగతుల మధ్య బోధన పొందుతున్న అన్ని మేనేజ్‌మెంట్లకు చెందిన విద్యార్ధులు సిద్ధం కావాలని విద్యాశాఖ జిల్లా యంత్రాంగం సూచిస్తోంది. ఈ ఏడాది జూలై 28న ప్రారంభమైన ఈ కార్యక్రమంలో విద్యార్థులు రిజిస్ట్రేషన్ చేసుకునేందుకు ఈ నెల 23లోగా దరఖాస్తు చేయాలి. అటుపై నవంబర్ లోగా విద్యార్థులు వారి స్కిల్స్‌కు పదునుపెట్టి నవంబర్ 30వ తేదీకి వారి ప్రాజెక్ట్‌ను

మారథాన్‌కు సిద్ధం

మారథాన్‌కు సిద్ధం