
● మోసం చేశారు.. ఆదుకోండి
రాజాంలోని ఓ ప్రైవేటు ఏజెన్సీ వద్ద గంగోత్రి రకం విత్తనాలు కొనుగోలు చేశాం. సుమారు 350 ఎకరాల్లో సాగుచేశాం. నాసిరకం విత్తనాలు కావడంతో కేళీలు వచ్చాయి. పంట సమయానికి ముందే కంకులు వచ్చాయి. పెట్టుబడి కూడా రాని పరిస్థితి నెలకుంది. ఆ ఏజెన్సీపై చర్యలు తీసుకుని ఎకరాకు రూ.50వేలు చొప్పున పరిహారం ఇప్పించాలంటూ రాజాం మండలంలోని నాయుడువలస, అమరాం గ్రామ రైతులు జిల్లా అధికారులను వేడుకున్నారు. వరి దుబ్బులను తెచ్చి కలెక్టరేట్ వద్ద సోమవారం ఆందోళన చేశారు. రైతు కష్టాన్ని గుర్తించి న్యాయం చేయాలని విజ్ఞప్తిచేశారు. కార్యక్రమంలో రైతు సంఘం నాయకుడు లోకవరపు ఆదినారాయణ, జి.వెంకటరమణ, ఎం.రామభగవన్‌దాసు, చిన్నంనాయుడు, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. – విజయనగరంఫోర్ట్