
ప్రకృతి అందాల కనువిందు
నెల్లిమర్ల రూరల్: సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం రామతీర్థం పరిసర ప్రాంతాలు సహజ సిద్ధ సౌందర్యానికి నిలయంగా మారుతున్నాయి. ఒక వైపు ఎత్తైన బోడికొండ. మరో వైపు నిండుకుండలా చెరువు ఎంతో అందంగా దర్శనమిస్తున్నాయి. దీనికి తోడు రామతీర్థం, సీతారామునిపేట పరిసర ప్రాంతాల్లో వేలాది ఎకరాల్లో ఉన్న వరి పంట పొలాలు పచ్చని సౌందర్యంతో కనువిందు చేస్తున్నాయి. ఈ దృశ్యాలు కళ్లకు హాయినిస్తూ, మనసుకు ఆనందాన్ని పంచుతున్నాయని ప్రకృతి ప్రేమికులు మురిసిపోతున్నారు. ఆదివారం ఈ అందమైన దృశ్యాలను సాక్షి తన కెమోరాలో బంధించింది.

ప్రకృతి అందాల కనువిందు